చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..

చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
x
Highlights

కావాల్సిన పదార్ధాలు : క్యారెట్, బీన్స్, ఉల్లికాడలు, క్యాప్సికమ్, రెండు గుడ్లు, 100 గ్రాముల చికెన్‌, నూనె, నెయ్యి, పెప్పర్, ఉప్పు, బియ్యం తయారీ విధానం...

కావాల్సిన పదార్ధాలు : క్యారెట్, బీన్స్, ఉల్లికాడలు, క్యాప్సికమ్, రెండు గుడ్లు, 100 గ్రాముల చికెన్‌, నూనె, నెయ్యి, పెప్పర్, ఉప్పు, బియ్యం

తయారీ విధానం :

కుక్కర్‌లో కొంచెం నీరు పోసుకుని అందులో చికెన్ వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసుకుని రెండు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. అందులో నెయ్యి వేయాలి. అరగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. నీరు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన బియ్యాన్ని ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వేసుకుని,చికెన్ స్టాక్ ను అందులో వేసి, సరిపడినంత నీరు పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. అందులో నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తరువాత రెండు గుడ్లను బీట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ పెప్పర్ వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్‌రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేరే కడాయి తీసుకుని నూనె వేసుకోవాలి. అందులో క్యారెట్, బీన్స్ ముక్కలను వేసుకోవాలి. కాస్త వేగించాలి. తరువాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఉల్లికాడలను కూడా వేసుకోవాలి. ఇందులోనే రైస్ వేసుకొవాలి. రైస్ , వెజిటేబుల్స్ బాగా కలపాలి. ఆల్‌రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ ఎగ్ ఫ్రైని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories