చికెన్‌ సూప్ ను ఇలా తయారు చేసుకోండి..

చికెన్‌ సూప్ ను ఇలా తయారు చేసుకోండి..
x
Highlights

చికెన్ లో ఎన్నో మంచి పోషకాలు ఉంటాయి. పెరుగుదలకు అవసరమైన ఎమినో యాసిడ్స్ వంటి వివిధ రకాల ప్రోటీన్స్ చికెన్ లో పుష్కలంగా లభిస్తాయి. చికెన్ ను క్రమం...

చికెన్ లో ఎన్నో మంచి పోషకాలు ఉంటాయి. పెరుగుదలకు అవసరమైన ఎమినో యాసిడ్స్ వంటి వివిధ రకాల ప్రోటీన్స్ చికెన్ లో పుష్కలంగా లభిస్తాయి. చికెన్ ను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకునే వారి ఫిజికల్ యాక్టివిటీలు పెరిగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మనసుకు ప్రశాంతతనిచ్చి సెల్ఫ్ కంట్రోల్ ను పెంపొందించే శక్తి చికెన్ లో ఉందట. పిల్లల ఆహారంలో చికెన్ కు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. తల్లులు వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉన్న చికెన్ ను తమ పిల్లలకు ఆహారంగా ఇస్తారు. మెదడు ఎదుగుదలకు చికెన్ తోడ్పడుతుంది. ఎముకలను శక్తివంతం చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

గ్రీన్‌ వెజిటబుల్‌ ముక్కలు – ఐదు

ఉడకబెట్టిన చికెన్‌

ఉల్లికాడలు – నాలుగు

చికెన్‌ వాటర్‌ – ఐదు పెద్ద స్పూన్లు

పుట్టగొడుగులు – ఐదు

తయారీ విధానం :

స్కిన్‌లెస్‌ చికెన్‌ను పెద్ద ముక్కలుగా కట్‌ చేయాలి. పుట్టగొడుగులను కూడా సమ పరిమాణంలో ముక్కలుగా తరగాలి. ఒవెన్‌లో ఉపయోగించే పాత్రలో చికెన్‌ ముక్కలు, గ్రీన్‌ వెజిటబుల్‌ ముక్కలు, పుట్టగొడుగులు వేయాలి. చికెన్‌ స్టాక్‌ అందులో పోయాలి. ఈ మిశ్రమాన్ని ఒవెన్‌లో గంటపాటు ఉడికించాలి. తర్వాత దానిపై కొత్తిమీర చల్లాలి. చికెన్‌ సూప్‌ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories