జ్వరం వచ్చిన వారికి చెన్నంగి చట్న

జ్వరం వచ్చిన వారికి చెన్నంగి చట్న
x
Highlights

వర్షంకాలం అంటేనే చాల మందికి భయం. ఎందుకంటే ఈ సీజన్ లో రోగాలు అలాంటివి మరి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. జ్వరం వచ్చిన వారికి...

వర్షంకాలం అంటేనే చాల మందికి భయం. ఎందుకంటే ఈ సీజన్ లో రోగాలు అలాంటివి మరి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. జ్వరం వచ్చిన వారికి అయితే అసలు తినలనిపించదు. పోని ఓపికా చేసుకుని ఎదైనా కాస్త తిందాంమనుకుంటే నోరు చేదుగా ఉంటుంది. దాంతో తినాలనే కోరిక కూడా పోతుంది. ఇలాంటి సమస్యను ఓ చట్నీతో అదిగమించవచ్చు. అదే చెన్నంగి చట్నీ. జ్వరం వచ్చి న వాళ్లకి ఈ చట్నీ తిరిగి రుచి తెలిసేలా చేస్తుంది.

చెన్నంగి చట్నీ కోసం.. ముందుగా చెన్నంగి ఆకులు సిద్దంగా ఉంచుకోవాలి. కొంచెం చింతపండు, వెల్లుల్లి, అర స్పూన్అల్లం తురుము, ఒక స్పూన్ జీలకర్ర, రెండు స్పూన్ ల నూనె, 6 ఎండు మిరపకాయలు, ఉప్పు రెడీగా పెట్టుకోవాలి. తాలింపుకు.. అర స్పూన్ అవాలు, స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఒక స్పూన్ మినప్పప్పు, సెనగపప్పు ను సిద్ధం చేసుకోవాలి.

చెన్నంగి చట్నతయారీ విధానం:

చింతపండుని ఒక గిన్నెలో వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో కొంచెం అయిల్ పోసుకుని అందులో ఎండుమిర్చిని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్ కడాయిలో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, చెన్నంగి ఆకులు వేసుకుని ఓ పది నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ కట్టేసుకోవాలి. నానబెట్టిన చింతపండు, వేయించిన ఎండుమిర్చి, చెన్నంగి ఆకు మిశ్రమాన్ని వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమానికి తాలింపు వేసుకుంటే రుచికరమైన చెన్నంగి ఆకు పచ్చడి రెడీ అయినట్లే.జ్వరం వచ్చిన వారికి చెన్నంగి చట్న

Show Full Article
Print Article
More On
Next Story
More Stories