ఆరోగ్యానికి చామదుంప వేపుడు

ఆరోగ్యానికి చామదుంప వేపుడు
x
Highlights

చామదుంపలో నిజానికి చాలా పోషకాలు ఉంటాయి. దీనిని ఉడికించి, వేయించి, కాల్చుకుని తినొచ్చు. మాంసానికి ప్రత్యామ్నాయంగా మంచి రుచిని, పోషకాలని చామదుంపలు...

చామదుంపలో నిజానికి చాలా పోషకాలు ఉంటాయి. దీనిని ఉడికించి, వేయించి, కాల్చుకుని తినొచ్చు. మాంసానికి ప్రత్యామ్నాయంగా మంచి రుచిని, పోషకాలని చామదుంపలు ఇస్తాయి. శక్తిని ఇస్తుంది . 100 గ్రాముల చామదుంపల్లో సుమారు 120 కేలరీల శక్తి ఉంటుంది. వీటిలో ఎక్కువ కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ లభిస్తాయి. డయటరీ పీచును నెమ్మదిగా జీర్ణం చేస్తూ రక్తప్రసరణలోకి గ్లూకోజ్‌ను స్థిరంగా విడుదల చేస్తాయి. వీటివల్ల ఎక్కువసేపు శరీరంలో సరిపోను శక్తి లభిస్తుంది. బరువు తగ్గడంలో సహకరిస్తాయి. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రోటీన్లూ ఉంటాయి.

కావలసిన పదార్ధాలు

చామ దుంపలు - పావు కిలో

బియ్యప్పిండి - పెద్ద స్పూన్

కారం - స్పూన్

పసుపు - పావు స్పూన్

ఆమ్‌చూర్‌ పొడి - అర స్పూన్

ఉప్పు - తగినంత

నూనె - వేయించేందుకు సరిపడా

తాలింపు కోసం:

మినప్పప్పు - స్పూన్

ఆవాలు - అర స్పూన్

ఎండుమిర్చి - రెండు

కరివేపాకు - ఒక రెబ్బ

వెల్లుల్లి రెబ్బలు - ఐదు

నూనె - స్పూన్

కూరకారం - స్పూన్

తయారీ విధానం:

శుభ్రంగా కడిగిన చామదుంపల్ని కుక్కర్‌లో వేసి ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. తరవాత చెక్కు తీసి చక్రాల్లా కోయాలి. వీటిపై బియ్యప్పిండి, కారం, పసుపు, ఆమ్‌చూర్‌ పొడి, ఉప్పు, నూనె వేసి ఇవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. కావాలంటే బియ్యంపిండిని మరికొంచెం కూడా కలుపుకోవచ్చు. కడయిని స్టవ్ మీద పెట్టి నూనె వేసి ఈ ముక్కల్ని కరకరలాడేలా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి మెత్తగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. దీంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న చామ దుంప ముక్కలు వేసి, పైన కూరకారం చల్లాలి. రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. చామదుపం ప్రై రెడీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories