క్యారట్‌ హల్వ తయారీ ఎలా?

క్యారట్‌ హల్వ తయారీ ఎలా?
x
Highlights

క్యారెట్ తినడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తలెత్తవు. మ‌హిళ‌లు నిత్యం ఒక గ్లాస్...

క్యారెట్ తినడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తలెత్తవు. మ‌హిళ‌లు నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ దూరమవుతుంది. క్యారెట్లలో వుండే విటమిన్ ఎ, బీటా కెరోటీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. బ్లడ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. సూచిస్తున్నారు.

కావల్సిన పదార్థాలు:

క్యారెట్లు: 1 kg

పాలు: 2 లీటర్లు

ఖోవా: 150 గ్రాములు

పంచదార: ఒక కప్పు

నెయ్యి 2 టేబుల్ స్పూన్‌లు

గార్నిషింగ్ కోసం :

జీడిపప్పులు: 8

బాదం: 6

ఏలకుల పొడి : 1చిటికెడు

తయారీ విధానం :

ముందుగా గిన్నెలో పాలు పోసి బాగా మరింగించాలి. మద్యమద్యలో స్పూన్ తో కలియబెడుతుండాలి. లేదంటే ప్రాత అడుగున అంటుకొంటుంది. కాబట్టి మద్యమద్యలో కలియబెడుతూ 45 నుంచి 50 నిముషాల పాటు బాగా మరగకాచాలి. పాలు చిక్కగా , క్రీమీగా మారుతున్న సమయంలో అందులో క్యారెట్ తురుమును వేసి క్యారెట్ ను బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే పాలు క్యారెట్ బాగా కలిసేలా ఉడికించాలి.. క్యారెట్ బాగా మెత్తబడుతూ పాలు పూర్తిగా ఇమిరిపోయే వరకూ ఉడికించాలంటే కనీసం 45 నిముషాల సమయం పడుతుంది. పాలు మొత్తం క్యారెట్ తో ఇంకిపోయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు మరో పాన్ లో నెయ్యి వేసి, వేడి చేసి అందులో పాలలో ఉడికించుకొన్న క్యారెట్ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా నెయ్యిలో మిక్స్ చేస్తూ, అలాగే కోవా, పంచదార వేస్తూ.. మిక్స్ చేస్తూ తక్కువ మంట మీద మరో 10 నుంచి 15నిముషాలు ఉడికించుకోవాలి. పంచదార పూర్తిగా క్యారెట్ మిశ్రమంలో కలిసిపోయి, కరిగిపోయే వరకూ సన్నని స్పూన్ తో అలాగే కలుపుతుండాలి. ఇలా పూర్తిగా చేసిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే కోవా క్యారెట్ హాల్వా రెడీ. చివరగా కట్ చేసి పెట్టుకొన్ని నట్స్ తో గార్నిష్ చేసుకోవాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories