Top
logo

చికెన్ 65 లాగ క్యారెట్‌ 65..

చికెన్ 65 లాగ క్యారెట్‌ 65..
X
Highlights

విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా...

విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే పరిమాణములో క్యారెట్ విటమిన్ బి, సి, జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది. ఇది మంచి పటిష్టమైన పళ్ళకూ ఎముకలకు, మంచి చర్మానికీ కావలసిన అత్యావశ్యకమైన పదార్ధం.

కావలసిన పదార్ధాలు

క్యారెట్‌ - 250గ్రా

మైదా - 50గ్రా

శనగపిండి - 50గ్రా

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ -టేబుల్ స్పూన్

ఉప్పు - తగినంత

పెరుగు - కప్పు

పచ్చిమిరపకాయలు - 20గ్రాములు

కరివేపాకు - కట్ట

నూనె

కారం - టేబుల్ స్పూన్

ఆరెంజ్‌ కలర్‌ - హాఫ్ స్పూన్‌

తయారీ విధానం :

క్యారెట్‌ను శుభ్రం చేసి గుండ్రంగా చిన్న చిన్న చక్రాల్లా కోసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పెరుగు, ఆరెంజ్‌ కలర్‌ను కలిపి బజ్జీల పిండిలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిలో క్యారెట్‌ ముక్కలను ముంచి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి. ఇంకో బాణలిలో కొద్దిగా నూనె పోసి నిలువుగా చీల్చిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు రెబ్బలను వేసి బాగా వేయించాలి. ఇందులో వేయించిన క్యారెట్‌ ముక్కలు కలిపి మరో మూడు నిమిషాలు ఫ్రైచేయాలి. అంతే క్యారెట్‌ 65 రెడీ.

Next Story