మసాలా క్యాప్సికం కర్రీ.. తయారీ ఎలా?

మసాలా క్యాప్సికం కర్రీ.. తయారీ ఎలా?
x
Highlights

క్యాప్సికంతో కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు దీనిని విడిచిపెట్టరు. తక్కువలో తక్కువ మంది క్యాప్సికం కర్రీని ఇష్టపడతారు. ఇది అనేక వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచుతుంది.

క్యాప్సికంతో కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు దీనిని విడిచిపెట్టరు. తక్కువలో తక్కువ మంది క్యాప్సికం కర్రీని ఇష్టపడతారు. ఇది అనేక వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ఎన్నో రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా ఈ క్యాప్సికం మని చేస్తుంది. క్యాప్సికం ఆహారంలో నిత్యం బాగం చేసుకుంటే చర్మ సమస్యలు , కండరాల సమస్యలు, అర్జీలతో పాటు కంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా క్యాప్సికం ను అంత ఇష్టంగా ఎవరూ తీసుకోరు. కాబట్టి నోటికి రుచి తగిలేలా... ఎంతో రుచికరమైన మసాలా క్యాప్సికం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. చూడండి. ముందుగా..

కావాల్సిన పదార్ధాలు:

క్యాప్సికం

♦ ఉల్లిగడ్డ

♦ చింతపండు

♦ పచ్చిమిర్చి

♦ ఆవాలు

♦ మినపగుళ్లు

♦ జీలకర్ర

♦ నూనె

♦ పసుపు

♦ కారం

తయారీ విధానం:

ముందుగా పావుకిలో క్యాప్సికం ను తీసుకోవాలి..పెద్దవి ఆకుండా చిన్న సైజులో ఉన్నవాటిని ఎన్నుకోవాలి. వీటని గుత్తుగా కోసుకోవాలి. ఇప్పుడు మూడు ఉల్లిగడ్డలను చిన్నగా ముక్కలను కట్ చేసుకుని పెట్ఉటకోవాటి.. మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా తరగాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు అరటిస్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులోనూ కసిన్ని మినపప్పు గుళ్ళు వేసుకోవాలి.

ఇప్పుడు అరటీస్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టకున్న ఉ్లలి, పచ్చిమిర్చి ముక్కుల వేసి వేయించాలి. దీనికి కాస్త ఉప్పు కలపాలి.. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.. మిక్సీ లోకి వీటన్నింటిని తీసుకోవాలి. మెత్తగా రుబ్బుకోవాలి.. ఇందులోనే చింతపండు పిప్పిని వేసుకోవాలి... ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి... బాగా కలుపుకోవాలి... ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక్కో క్యాప్సికమ్ లో స్టఫ్ చేసుకోవాలి.. ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేసుకోవాలి.. ఇప్పుడు క్యాప్సికం ముక్కలను ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ముక్కలగా దగ్గరయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.. అంతే మసాలా క్యాప్సికమ్ కూర రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories