బిసిబెల్లిబాత్ తయారీ ఎలా..?

బిసిబెల్లిబాత్ తయారీ ఎలా..?
x
Highlights

కావలసిన పదార్ధాలు :300 గ్రాముల బియ్యం 100 గ్రాముల పప్పు పసుపు సాంబార్ పౌడర్ ఉప్పు చింతపండు పులుసు టమాట నూనె మునక్కాయలు ఉల్లిపాయలు 100...

కావలసిన పదార్ధాలు :

300 గ్రాముల బియ్యం

100 గ్రాముల పప్పు

పసుపు

సాంబార్ పౌడర్

ఉప్పు

చింతపండు పులుసు

టమాట

నూనె

మునక్కాయలు

ఉల్లిపాయలు

100 గ్రాముల క్యారెట్

బీన్స్ ముక్కలు

బంగాళదుంప ముక్కలు

తయారీ విధానం

స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌ను పెట్టుకోవాలి. మూడు కప్పుల బియ్యం, ఒక కప్పు పప్పుకు మామూలుగా 8 గ్లాసుల నీరు పోస్తాం..కానీ బిసిబిల్లీబాత్ కాబట్టి ఇందులో 10 గ్లాసుల నీళ్లు పోయాలి. 20 నిమిషాలు నానబెట్టిన బియ్యం, పప్పును ఇందులో వేసుకోవాలి..తరువాత పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి.ఇప్పుడు మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ రావడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి...ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పై పెట్టి అందులో నూనె పోసుకుని ఆవాలు వేసుకోవాలి... అవి చిటపటలాడిన తరవుాత స్టవ్ సిమ్‌లో పెట్టుకుని ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండు మిర్చి వేసుకోవాలి. టమాట ముక్కలను కూడా వేసుకోవాలి. రెండు లవంగాలు, రెండు ఇలాచీలు వేసుకోవాలి. తరువాత మునక్కాయలు , క్యారెట్, బీన్స్ తో పాటే బంగాళదుంపలను వేసుకోవాలి...వీటిని బాగా కలుపుకోవాలి. కూరగాయలను బాగా కలుపుతూ ఉండాలి. మాడకుండా ముక్కలను బాగా వేగనివ్వాలి. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకోవాలి. మూత పెట్టి ఐదునిమిషాలు కూరగాయ ముక్కలను మగ్గనివ్వాలి. నీరు పోయేంత వరకు కూరగాయలను వేపాలి..ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఉడికిన రైస్‌ ను బాగా కలిపి అందులో చింతపండు రసం, కొంచెం నీరు వేసుకోవాలి. రైస్ ను బాగా కలుపుకోవాలి. ముందుగా పప్పు, బియ్యాన్ని కుక్కర్ లో ఉడికించిన తరువాతనే కూరగాయ ముక్కలను వేుసుకోవాలి లేదంటే పప్పు , కూరగాయలు సరిగా ఉడకవు.... కూరగాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. కుక్కర మూత పెట్టి ఒక విజిల్ ని తీసుకోవాలి...బిసిబెల్లీ బాత్ రెడీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories