అరటి పాన్‌ కేక్‌ తయారీ ఎలా?

అరటి పాన్‌ కేక్‌ తయారీ ఎలా?
x
Highlights

కొన్ని పండ్లు సీజన్‌ వారీగా లభిస్తాయి..మరి కొన్ని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభిస్తాయి. కానీ అన్ని సీజన్‌లలో ఏడాది పొడవునా లభించే పండ్లు అరటి పండ్లు. ఈ అరటి పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి..

కొన్ని పండ్లు సీజన్‌ వారీగా లభిస్తాయి..మరి కొన్ని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభిస్తాయి. కానీ అన్ని సీజన్‌లలో ఏడాది పొడవునా లభించే పండ్లు అరటి పండ్లు. ఈ అరటి పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి..చవకగా దొరికే ఈ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి..మరి రోజూ అరటి పండ్లను తినడానికి పిల్లలు ఇష్టపడరు వారికోసమే కొత్త కొత్త వంటలు పుట్టుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా పిల్లలకు కేక్స్ అంటే చాలా ఇష్టం..వారంలో ఒకసారి వీటి కోసం బేకరీలకు వెళ్లాల్సిందే..అలా కాకుండా పిల్లలు ఎప్పుడు కోరితే అప్పుడు...నిమిషాల్లో కేక్‌ను తయారు చేసుకోవచ్చు..అందులోనూ ఎన్నో పోషకాలైన అరటి పాన్‌ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

కావాల్సిన పదార్ధాలు:

అరటి పండ్లు

♦ కార్న్ ఫ్లోర్‌

♦ బియ్యం పిండి

♦ మైదా పిండి

♦ చక్కెర

♦ పాలు

♦ నీళ్లు

♦ నూనె

♦ తేనె

తయారీ విధానం:

ముందుగా నాలుగు అరటిపండ్లను తీసుకోవాలి..వీటి తొక్కతీసి చిన్న ముక్కలుగా చేసుకుని ఒక మిక్సీలో వేసుకోవాలి. అందులోనే ఇప్పుడు ఒకటిన్నర కప్పు పాలు పోసుకోవాలి..ఇప్పుడు ఈ రెండింటిన చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. ఇందులో అరకప్పు కార్న్‌ ఫ్లోర్ , అరకప్పు బియ్యంపిండి, మూడు టేబుల్ స్పూన్‌ల మైదా పిండి వేసుకోవాలి...వీటిని బాగా కలుపుకున్నాక.. ఇందులోనే పంచదారని పొడిగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే సిద్ధం చేసి పెట్టకున్న అటి పండు పాల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట వరకు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

ఇలా చేయడం వల్ల పాన్ కేక్‌లు చాలా స్మూత్‌గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ అన్ చేసుకోవాలి. దానిపై పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిజ్‌లో ఉన్న అరటి పండ్ల మిశ్రమాన్ని తీసి బయట పెట్టుకోవాలి..బాగా కలుపుకోవాలి...నూనె వెడెక్కాక ఇప్పుడు ఒక గరిట తీసుకుని చిన్న చిన్న పాన్‌కుక్ ఆకారం వచ్చేలా పెనం మీద పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి.. వీటిని అటు ఇటు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రెండు అరటి పండ్లను కట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. కేక్‌లు రెడీ అవ్వగానే వాటిపై తేనె వేస్తేసరి వేడి వేడి పాన్‌కేక్ లు రెడీ.. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. సాయంకాలం స్నాక్‌గా ఇవి ఎంతో బాగుంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories