అరటి పువ్వు వడలు తయారీ ఎలా?

అరటి పువ్వు వడలు తయారీ ఎలా?
x
Highlights

అరటి పువ్వు వడలు తయారీ ఎలా?అరటిపువ్వులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని రోజువారి ఆహారంగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు. మధుమేహ వ్యాధిని అదుపులో...

అరటి పువ్వు వడలు తయారీ ఎలా?అరటిపువ్వులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని రోజువారి ఆహారంగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు.. అరటిపుప్పుతో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే మంచిది. రక్తపోటును తగ్గిస్తుంది.

కావలసిన పదార్థాలు:

అరటిపువ్వు తురుము – 2 కప్పులు

కందిపప్పు – అరకప్పు

శెనగపిండి – అరకప్పు

ఎండుమిర్చి – 5

పచ్చిమిర్చి – 2

అల్లం – చిన్న ముక్క

వెల్లుల్లి రెమ్మలు – 5

ఇంగువ – అరస్పూన్

పసుపు – పావు స్పూన్

సోంపు – ఒకటిన్నర స్పూన్

బియ్యం పిండి – పావుకప్పు

ఉల్లి తరుగు – 1 కప్పు

కరివేపాకు, కొత్తిమీర తరుగు – పావుకప్పు

ఉప్పు – తగినంతా

నూనె

తయారీ విధానం:

ముందుగా పప్పులను విడివిడిగా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, సోంపు, వెల్లుల్లి, అల్లాన్ని మెత్తగా రుబ్బాలి. ఆ తరువాత నానబెట్టిన పప్పులు వేసి కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. తరువాత అరటిపువ్వు తురుము, కరివేపాకు, కొత్తిమీరు, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు, ఉల్లి తరుగు, బియ్యం పిండి, పప్పుల మిశ్రమం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను వేసి వేడిచేయాలి.. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వడలుగా ఒత్తి నూనెలో దోరగా వేయించాలి. వేడి వేడి అరటిపువ్వు వడలు రెడీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories