ఆలూ బోండా తయారీ ఎలా?

ఆలూ బోండా తయారీ ఎలా?
x
Highlights

ఒక మధ్య స్థాయి ఆలుగడ్డలో 1.9 మి.గ్రాముల ఐరన్ ఉంటుంది. ఇవి 10శాతం ఐరన్ పోషకాలను అందించగలదు. ఆలులో సోడియం శాతం తక్కువ కాబట్టి ఆరోగ్యకర రక్త ప్రసరణ...

ఒక మధ్య స్థాయి ఆలుగడ్డలో 1.9 మి.గ్రాముల ఐరన్ ఉంటుంది. ఇవి 10శాతం ఐరన్ పోషకాలను అందించగలదు. ఆలులో సోడియం శాతం తక్కువ కాబట్టి ఆరోగ్యకర రక్త ప్రసరణ ఉండేలా నియంత్రించుకోవచ్చు. వీటిలో విటమిన్ 'సి' కోసం ఆలూ బోండాఅధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బాగా ఉడకబెట్టిన ఆలును అల్పాహారంగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

కావలసిన పదార్ధాలు :

ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు

సాబుదానాలు

మైదా

ఉప్పు

కొబ్బరి

అటుకులు

పచ్చిమిర్చి

యాలాకులు

చెక్కెర

జీడిపప్పు

కిస్మిస్

తయారీ విధానం

ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను పొడి చేసుకోవాలి.

ఒక బౌల్ తీసుకుని కొబ్బరి తురుము వేసుకోవాలి. అందులోనే నానబెట్టి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. తరువాత యాలాకులు, పచ్చిమిర్చి, కిస్మిస్, బాదాంపప్పు, చెక్కెర వేసుకుని బాగా కలుపుకోవాలి..ఇప్పుడు బంగాల దుంప ముక్కలను మెత్తగా చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. మైదా పిండి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. . చేతికి నూనె రాసుకుని ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముద్దను తీసుకుని అందులో రెడీ చేసుకున్న మిశ్రమాన్ని స్టఫడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్‌రెడీ వేపుకుని పొడి చేసుకున్న సాబుదాన పొడిని తీసుకోవాలి. ముద్దలకు పిండినిిపట్టించాలి . స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకోవాలి. .నూనెను బాగా మరిగించాలి. ఇప్పుడు బోండాలను ఫ్రై చేసుకోవాలి...ఆలూ బోండా రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories