ఆలూ సమోసా అంటే అందరికీ ఇష్టమే.. కానీ..

ఆలూ సమోసా అంటే అందరికీ ఇష్టమే.. కానీ..
x
Highlights

ఆలూ సమోసా అంటే అందరికీ ఇష్టమే... చిన్నపిల్లలైతే... ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. అయితే స్ట్రీట్ ఫుడ్ అయిన ఈ సమోసాను ఇంట్లోనే అదే ఫ్లేవర్ తో టేస్ట్...

ఆలూ సమోసా అంటే అందరికీ ఇష్టమే... చిన్నపిల్లలైతే... ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. అయితే స్ట్రీట్ ఫుడ్ అయిన ఈ సమోసాను ఇంట్లోనే అదే ఫ్లేవర్ తో టేస్ట్ వచ్చే విధంగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా దీనిని తినిపించవచ్చు. అయితే తయారీ విధానంలో కొన్ని టిప్స్ పాటిస్తే చాలు.. మరి అలూ సమోసా తయరీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు:

*ఆలూ - నాలుగు

*మైదా పిండి - రెండు కప్పులు

*ఉల్లిగడ్డ – ఒకటి

*పచ్చిమిర్చి - నాలుగు

*వామును - టీస్పూన్

*నెయ్యి - టేబుల్ సపూన్

*జీలకర్ర - అరటీస్పూన్

*దనియాలు - టేబుల్ స్పూన్

*అల్లంవెల్లుల్లి పేస్ట్- టీస్పూన్

*చిల్లీ ఫ్లేక్స్ - టేబుల్ స్పూన్

*చాట్ మసాలా - అరటీస్పూన్

*కొత్తమీర

*నిమ్మరసం

తయారీ విధానం :

ముందుగా అలూను తీసుకుని కుక్కర్‌లో వేసి నీరు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు బౌల్ లోకి మైదా పిండిని వేసుకోవాలి..ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కాస్త వామును వేసుకోవాలి. వాము వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది..అలాగే తొందరగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు కాస్త నెయ్యి వేసి పిండిని బాగా కలపాలా..పిండిలో నెయ్యి కలపడం వల్ల సమోసా పై భాగం క్రిస్పీగా క్రంచీగా వస్తాయి..పిండిలో నీటిని కలుపుతూ చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఇలా కలిపాక నంచి కాస్త నూనె వేసి పిండి పై భాగంలో అప్లై చేసి 20 నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టాలి..

ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులోకి టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వేడి చేయాలి..ఇందులో అరటీస్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి..ధనియాలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి...ఇప్పుడు టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, పసుపు,అరటీస్పూన్ చాట్ మసాలా, ఉప్పు వేసుకోవాలి..చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే అరటీస్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అలూను మాష్ చేసి ఇందులో వేసుకోవాలి... బాగా కలుపుకోవాలి..ఇప్పుడు కొత్తమీర తురుము వేసుకుని బాగా కలపాలి..చివరిగా అరచెక్క నిమ్మరసం వేసి...బాగా కలపాలి..

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిని స్టఫింగ్‌ ను చల్లార్చాలి..

ఇప్పడు మైదా పిండిని తీసుకుని బాగా ప్రెస్ చేయాలి. నిమ్మపండంత పిండి తీసుకుని రోల్ చేసుకోవాలి...సన్నగా తాల్చాలి... అలా చేయడం వల్ల సమోసా పై భాగం క్రంచీగా వస్తుంది... పిండిని గుండ్రంగా కాకుండా సిలిండర్ షేప్ వచ్చేలా చేసుకోవాలి... సమోసాను పై భాగాన్ని తయారు చేసుకోవాలి... సమోసా పై లేయర్‌ను తయారుచేసుకున్నాక .ఇప్పుడు ఆలూ స్టఫింగ్ ను తీసుకుని అందులో వేసి సమోసాను క్లోజ్ చేసుకోవాలి...ఇప్పుడు రెడీ చేసుకున్న సమోసాలను డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి నూనెవేడి అయ్యాక మీడియం ఫ్లేమ్‌లో సమోసాలను ఫ్రై చేసుకోవాలి... మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి సమోసా రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories