Top
logo

తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ

తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ
X
Highlights

దాదాపు 1500 రకాల మామిడి పండ్లు భారతదేశంలో పండుతాయి. ప్రతి రకానిదీ ఒక్కో రుచి. మామిడి పండ్లను మనం ఎంతో ఇష్టంగా...

దాదాపు 1500 రకాల మామిడి పండ్లు భారతదేశంలో పండుతాయి. ప్రతి రకానిదీ ఒక్కో రుచి. మామిడి పండ్లను మనం ఎంతో ఇష్టంగా తింటాం..టేస్ట్ లోనే కాదు ఆరోగ్యపరంగానూ మామిడిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మామిడిలో అధిక స్థాయిలో కేలరీలు ఉంటాయనే మాట నిజమే కానీ ఇందులో సి-విటమిన్‌ అధికంగా లభిస్తుంది...కావాల్సినంత ఎ-విటమిన్‌ ఉంటుంది. మామిడిలో పొటాషియం ఎక్కువే, బి6-విటమిన్‌ కూడా ఉంది. అందుకే మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే.

కావలసిన పదార్ధాలు

మామిడికాయ ముక్కలు - కేజీ

ఉప్పు - 250 గ్రాములు

కారం - 125 గ్రాములు

నువ్వుల నూనె - 250 ఎం.ఎల్

అల్లం ముద్ద - 125 గ్రాములు

వెల్లుల్లి ముద్ద - 125 గ్రాములు

పసుపు - 25 గ్రాములు

జీలకర్ర పొడి - 50 గ్రాములు

మెంతిపొడి - 10 గ్రాములు

ఇంగువ - కొద్దిగా

ఆవాలు-టీ స్పూన్

జీలకర్ర -టీ స్పూన్

మెంతులు-టీ స్పూన్

తయారీవిధానం

మామిడికాయ ముక్కలను కట్‌చేసి తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పచ్చళ్ల కారం పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలపాలి. ఇందులో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపాలి. శుభ్రమైన జాడీలోకి ఎత్తిపెట్టుకోవాలి. మూడు రోజుల తర్వాత ఇంకోసారి కలిపితే చాలు అల్లం ఆవకాయ రెడీ.

Next Story