పిల్లలు పుట్టాక కూడా బాడీని మెయిన్‌టేన్ చేయవచ్చు..

పిల్లలు పుట్టాక కూడా బాడీని మెయిన్‌టేన్ చేయవచ్చు..
x
Highlights

పెళ్లికి ముందు అమ్మాయిలు అందంగా కనిపించేందుకు , ఫిట్‌నెస్‌ను మెయిన్‌టేన్ చేసేందుకు నానా కష్టాలు పడతారు. వివిధ డైట్‌ షీట్‌లను ఫాలో అవుతూ కడుపును...

పెళ్లికి ముందు అమ్మాయిలు అందంగా కనిపించేందుకు , ఫిట్‌నెస్‌ను మెయిన్‌టేన్ చేసేందుకు నానా కష్టాలు పడతారు. వివిధ డైట్‌ షీట్‌లను ఫాలో అవుతూ కడుపును మాడ్చుకుంటూ ఫిగర్ ను మెయిన్‌టేన్‌ చేస్తారు. కానీ పె‌ళ్లైన తరువాత అందులోనూ డెలివరీ తరువాత ఒక్కసారిగా ఒంట్లో మార్పు వచ్చేస్తుంది...అప్పటి వరకు నాజూగ్గా ఉన్న మగువలు ఒక్కసారిగా ఫిగర్‌ ఔట్ అవుతారు...మళ్లీ తమ వెయిట్‌ను తగ్గించుకునేందుకు ఎన్నో సాధనాలు చేస్తారు. కానీ ఎందులోనూ ఫలితం ఉండదని భావిస్తుంటారు.. సన్నబడటం కష్టం అనుకుంటారు కానీ... ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు పొందడం సులువే. అవి ఏమిటంటే....

సులువుగా సన్నబడాలనే ఉద్దేశంతో క్రాష్‌డైట్ల జోలికి అస్సలు పోకూడదు. వాటివల్ల సులువుగా బరువు తగ్గుతారు కానీ... ప్రసవానంతరం పాపాయికి పాలు పడతారు కాబట్టి కొత్తగా తల్లులైన వారికి కొన్ని పోషకాలు అవసరం అవుతాయి. క్రాష్‌డైట్ల వల్ల ఇవేవీ అందవు. బాలింతగా ఉన్నప్పుడు 550 కెలొరీలు అదనంగా తీసుకుంటే చాలు. నెలలు గడిచేకొద్దీ క్రమంగా తగ్గించుకోవచ్చు.

ఏం ఏం తీసుకోవాలి :

పాపాయికి పాలు పట్టడం వల్ల కూడా బరువు అదుపులో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి కచ్చితంగా ఆరునెలలు పాలు పట్టండి. పీచుశాతం ఎక్కవగా ఉన్న పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దానివల్ల కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లు ఉంటుంది. అన్నిరకాల పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. మేలుచేసే మాంసకృత్తులు తీసుకోవడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. కొంత వరకూ బరువూ తగ్గుతారు. గుడ్లు, నట్స్‌, చిక్కుడుజాతి గింజలు వంటివి ఎంచుకోవాలి.

ఏం ఏం తీసుకోకూడదు :

చక్కెర, ఉప్పుశాతం ఉన్న పదార్థాలు, ప్రాసెస్‌ చేసిన పదార్థాలను మానేయాలి. వీటిలో కెలొరీలు ఎక్కువ, పోషకాలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు అనారోగ్యాలకు దారితీస్తాయి. నార్మల్ డెలివరీ అయితే వారం తరువాత వ్యాయామం మొదలుపెట్టొచ్చు. సిజేరియన్‌ అయితే రెండు నెలల తరువాత వైద్యులు పరీక్షించి, ఏ ఇబ్బందీ లేదని చెబితే మెల్లిగా వ్యాయామాలు చేయాలి. నడవడం, పరుగెత్తడం, సైకిల్ తొక్కడం... ఇలా ఏదో ఒకటి రోజూ అరగంట చేయాలి. పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే ఆ భాగం తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories