ఎక్కిళ్లు వస్తే నీళ్లు తాగుతున్నారా..!

ఎక్కిళ్లు వస్తే నీళ్లు తాగుతున్నారా..!
x
Highlights

ఎక్కిళ్లు చాలమందికి భోజనం చేసే టైంలో వస్తుంటాయి. అయితే ఎక్కిళ్లు వచ్చిన వెంటనే ఎవరో గుర్తు చేసుకుంటున్నారు.. అని చాలమంది అనుకుంటారు. నిజానికి...

ఎక్కిళ్లు చాలమందికి భోజనం చేసే టైంలో వస్తుంటాయి. అయితే ఎక్కిళ్లు వచ్చిన వెంటనే ఎవరో గుర్తు చేసుకుంటున్నారు.. అని చాలమంది అనుకుంటారు. నిజానికి ఎక్కిళ్లు ఎవరో తలుచుకోవటం వల్ల రావని సైన్స్ చెబుతోంది. శరీరంలోని డయాఫ్రంలో మార్పుల వల్ల ఎక్కిళ్లు వస్తాయని సైన్స్ చెబుతోంది. ఛాతిని, ఉదరభాగాన్ని వేరుపరిచే డయాఫ్రం చాలాసార్లు సంకోచించడం వల్ల ఎక్కిళ్లు వస్తాయి.

ఎక్కిళ్లు వచ్చినప్పుడు వెంటనే నీళ్లు తీసుకుని స్పీడుగా గుటకలు వేస్తారు. ఎక్కిళ్లు వచ్చినప్పుడు చాలమంది వాటర్ ని ఎక్కువగా తాగుతుంటారు. భోజనం మధ్యలో ఎక్కిళ్లు మానడానికి నీళ్లు ఎక్కువ తాగడం వల్ల వాటితోనే కడుపు నిండిపోతుందంటున్నారు నిపుణులు. ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఎక్కువగా నీళ్లు తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

స్పీడుగా తినడం, ఎక్కువ సేపు గట్టిగా నవ్వడం, అతిగా మద్యం సేవించడం వల్ల ఎక్కిళ్లు వస్తాయట. మరో విశేషం ఎంటంటే నరాల జబ్బులు, కాన్సర్‌ మందులు వాడే వారికి కూడా ఎక్కువగా ఎక్కిళ్లు వస్తాయట. అయితే ఎక్కిళ్లు రాగానే స్పీడుగా నీళ్లు తాగకుండా.. కొద్దికొద్దిగా నీరు తాగిటం మంచిదంటున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories