మంచి తేనెను గుర్తించండి ఇలా..

మంచి తేనెను గుర్తించండి ఇలా..
x
Highlights

పల్లెలు, తండాల, అడవిలో ఉండేవారి నుంచే ఒకప్పుడు తేనె లభించేది. ఇప్పుడు ప్రతి చోట తేనే లభిస్తుంది. తేనె ఇప్పుడు

పల్లెలు, తండాల, అడవిలో ఉండేవారి నుంచే ఒకప్పుడు తేనె లభించేది. ఇప్పుడు ప్రతి చోట తేనే లభిస్తుంది. తేనె ఇప్పుడు మార్కెట్‌లో సులువుగా దొరికే వస్తువుగా మారిపోయింది. అందులో కూడా చాలా బ్రాండ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలా లభించే తేనె మంచిదేనా? వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఎలాంటి తేనె కొంటే మంచిదో ఓసారి తెలుసుకుందాం!

నిజానికి ఆయా కంపెనీలు అమ్ముతున్న తేనెలన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసినవిగానే ఉంటాయి. ఇలా అధికంగా ప్రాసెస్ చేస్తే ఆ తేనె వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. ఇలాంటి ప్రాసెసింగ్ తేనెపై పరిశోధకులు చెబుతున్నదేంటంటే. మార్కెట్‌లో దొరికే తేనె కంటే .. పట్టు నుంచి తీసిన తేనెను కొనుక్కోవడమే బెటరంటున్నారు. తేనెపట్టు నుంచీ తీసిన తేనె మాత్రమే నిజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు అరోగ్య నిపుణులు.

స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు. అయితే మార్కెట్‌లో కంపెనీలు అమ్ముతున్న తేనె బాటిళ్లపై ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది నిజమైన తేనె కాదు కాబట్టి. అది ప్రాసెస్ చేసిన తేనె అవడం వల్ల అది సహజ లక్షణాల్ని కోల్పోతుంది. అందువల్ల అది తొందరగా పాడువుతుంది.స్వచ్చమైన తేనె నల్లగా ఉంటుంది. ఏమాత్రం ఆకర్షణీయంగా కనిపించదు. సో, ఈసారి మీరు కొనుక్కునే తేనె ఎంత నల్లగా ఉంటే అంత మంచిదని గుర్తించండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories