అలా చేస్తే ఇంటి నుంచి దోమలు పరార్!

అలా చేస్తే ఇంటి నుంచి దోమలు పరార్!
x
Highlights

వర్ష కాలంలో దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం ఆరు అయితే చాలు దోమల దండయాత్ర ప్రారంభం అవుతుంది. వీటిని నివారించడానికి అనేక రసాయనల మందులను...

వర్ష కాలంలో దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం ఆరు అయితే చాలు దోమల దండయాత్ర ప్రారంభం అవుతుంది. వీటిని నివారించడానికి అనేక రసాయనల మందులను ఉపయోగిస్తాము. వీటివలన మన ఆరోగ్యం పాడైపోతుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ కెమికల్ మందులను పీల్చటం వల్ల శ్వాస సంభందమైన వ్యాధుల భారీన పడే అవకాశాలు ఉన్నాయి. అలా కాకండా దోమల బాధ పోగోట్టడానికి ప్రకృతి సహజమైన పద్ధతులు వాడితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

డైనింగ్ టేబుల్ మధ్యలో పూదీన ఆకులను ఉంచండి. దీని వాసనకు ఈగలు, దోమలు పారిపోతాయి. ఇంటిని శుభ్రవరిచేటప్పుడు నీళ్ళలో చెంచాడు పసుపు కలిపి శుభ్రం చేస్తే ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి. ఇతర క్రిమికీటకాలు కూడా నశిస్తాయి. దోమలు ఎక్కువగా ఉన్నట్లు అయితే ఆరెంజ్ తోక్కలను బాగా ఎండబెట్టి కాల్చితే దాని నుంచి వచ్చే పోగకు దోమలు పారిపోతాయి.

వెల్లుల్లిపాయలను రోజుకు రెండు రేకులను కాల్చితే చాలు దోమలు రమ్మన్నా రావు. బెడ్రూమ్‌లో ఒక పాత్రలో నీళ్ళు పోసి అందులో కర్పూరపు బిళ్ళులు వేసి పెట్టండి.కర్పూరం వాసన ఘాటుగా ఉండటం వల్ల ఆ వాసనకు దోమలు చనిపోతాయి. అరటి, మామిడి తొక్కలు లేదా వేపాకులు ను ఎండబెట్టి కాల్చిన వాటి నుంచి వచ్చే పొగకు దోమలు రాకుండా ఉంటాయి.

రెండు లేదా మూడు బిర్యాని ఆకులను తీసుకుని తలుపులను మూసివేసి వాటిని కాల్చాలి,కాల్చటం వల్ల వచ్చే పోగకు దోమలు నశించటమే కాక వాటి నుంచి వచ్చే సువాసన మనస్సును ఆహ్లదకరంగా,ఉత్తేజితంగా ఉంచుతుంది..ఇంకా వేపనూనె, నిమ్మనూనె ను కలిపి ఒక ప్రమిదలో పోసి వత్తులు వేసి దీపం వెలిగించాలి.ఈ వాసన వల్ల కూడా దోమలు రావు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories