మీ పిల్లల విషయంలో ఈ తప్పులు చేశారో..

మీ పిల్లల విషయంలో ఈ తప్పులు చేశారో..
x
Highlights

చిన్న పిల్లలు చాలా విషయాలను తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. అమ్మనాన్నలనే వారు రోల్‌మోడల్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా ఇంటి వాతావరణం నుంచి సైకలాజిక్...

చిన్న పిల్లలు చాలా విషయాలను తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. అమ్మనాన్నలనే వారు రోల్‌మోడల్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా ఇంటి వాతావరణం నుంచి సైకలాజిక్ థియరీస్, సోషల్ స్కిల్స్ నేర్చుకుంటారు. అందువల్ల పిల్లల ఎదుగుతున్న సమయంలో వారి పట్ల శ్రద్ద పెట్టడడం పేరెంట్స్‌కు చాలా కీలకం. వాళ్లకు చిన్నప్పటి నుంచి మంచి గైడెన్స్ ఉంటేనే పెద్దయ్యాక వారు ఉన్నత పౌరులుగా మారతారు. అయితే చాలామంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంటారు. ఈ తీరే పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ధోరణి కలిగిస్తుంది. అవేంటో ఓసారి చూద్దాం...

చాలా మంది దంపతులు కుటుంబ,వ్యక్తిగత విషయాల గుర్తించి తమకు తాముగా స్వీయ విమర్శలు చేసుకుంటారు. మీ వైఫల్యాలు పిల్లల గుర్తిస్తే సరైన లక్ష్యాలు రూపొందించుకోవడంలో వారు విఫలం అవుతారు. ఇది పిల్లల్లో ఒత్తిడికి, ఈటింగ్ డిజార్డర్‌కి కారణమవుతాయి.

ప్రస్తుత కాలంలో గ్యాడ్జెట్స్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు.. పిల్లల పక్కనే ఉన్నా విషయం పట్టించుకోకుండా ఎవరి ఫోన్లో వారు బీజిగా మారిపోతున్నారు. పిల్లల ముందే పెద్దలు ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో మిమ్మల్ని చూసి పిల్లలు కూడా వాటికి అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. తమకు కూడా మొబైల్ కావాలని పట్టుబడతారు. తిండి, చదువు విషయంలోనూ గ్యాడ్జెట్స్ ఇస్తేనే చేస్తాం అన్న మొండితనం వారిలో పెరిగిపోతుంది. ఈ ధోరణి వాళ్ల చదువుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

చాలామంది తల్లిదండ్రుల్లో తమకున్నచేడు అలవాట్లను పిల్లల ఎదుట ప్రదర్శిస్తారు. ఉదాహరణకు తండ్రి పిల్లల ముందే మందు తాగడం, సిగరెట్ కాల్చడం చేస్తుంటారు. వాటిని చూసిన పిల్లలు ఆ పనులను వారికి కూడా చేయలనిపిస్తుంది. ఇది వారిని చేడు అలవాట్లకు అలవాటు పడేలా చేస్తుంది. తల్లిదండ్రులకు తెలియకుండానే చేడు అలవాట్లను బానిసై వారి భవిష్యత్‌ను ఇబ్బందుల్లో పడేసుకుంటారు

తల్లిదండ్రులు తమ పిల్లలను అన్ని రంగాల్లో రేసు గుర్రంలా పరిగెత్తాలని కోరుకుంటారు. వారికున్న అభిప్రాయలను వారిపై రుద్దాలని ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా చదువులో అందరికంటే పైచేయి సాధించాలని తాపత్రయపడుతుంటారు. వారు అనుకున్నది పిల్లలు చేయకపోతే స్నేహితులు, పక్కింటి పిల్లలు, బంధువుల పిల్లలతో పోల్చుతుంటారు. ఇది వారిని మరింతగా నిరుత్సాహానికి గురిచేస్తుంది. కావున వారిని ఎంకరేజ్ చేయడానికే ప్రయత్నించాలి కానీ కుంగిపోయోలా చేయకూడదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories