శరీరంలో నీరు తగ్గితే అనారోగ్యమే

శరీరంలో నీరు తగ్గితే అనారోగ్యమే
x
Highlights

రోజువారి జీవితంలో శరీరానికి తగినంత నీరు తీసుకోవడం అవసరం. సరైయన మోతాదులో నీరు తాగడం వల్ల దాదాపు 80 శాతం రోగాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు...

రోజువారి జీవితంలో శరీరానికి తగినంత నీరు తీసుకోవడం అవసరం. సరైయన మోతాదులో నీరు తాగడం వల్ల దాదాపు 80 శాతం

రోగాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది కావల్సినంత నీటిని తీసుకోరు. అయితే నీళ్లు తాగకపోతే జీవక్రియల తీరు కుంటుపడుతుంది. ఫలితంగా పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. అవేంటంటే ఓ సారి చూద్దాం

శరీరంలో నీటి శాతం తగ్గితే, మెదడుకు చేరే నీరు తగ్గుతుంది . దీంతో మెదడును కుదుపుల నుంచి కాపాడడానికి ఉపయోగపడే నీరు తగ్గడం వల్ల తలనొప్పి వస్తుంది.

ఒంట్లో నీరు తగ్గడం కారణంగా ఏకాగ్రత లోపిస్తుంది. దీంతో మతిమరుపు వస్తుంది

నోటి దుర్వాసనకు డీహైడ్రేషన్‌ కూడా కారణం. లాలాజలంలో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. దీనివల్ల నీరు తక్కువడం వల్ల నోరు పొడిబారి దుర్వాసన వస్తుంది.

నీరు శరీరంలో కావల్సినంత లేకపోతే మలం గట్టిపడుతుంది. సులభ విరేచనం కష్టమవుతుంది.

శరీరంలో నీరు తగ్గితే మెదడు ఆకలి సంకేతాలు పంపిస్తుంది. కాబట్టి ఆకలి వేసినప్పుడు ఆహారం బదులుగా నీరు తాగండి

రోజులో కనీసం 5 లీII నీరైనా తాగండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories