ఇలా చేయడం వల్ల ఎక్కిళ్ళు చిటికిలో పోగొట్టొచ్చు

ఇలా చేయడం వల్ల ఎక్కిళ్ళు చిటికిలో పోగొట్టొచ్చు
x
Highlights

ఎక్కిళ్ళను మనం చాలా సంధర్భంలో ఎదుర్కొన్న ఇబ్బందే. తినే సమయంలో అయితే ఆ బాధ మాటల్లో చెప్పలేము. ఆకలిగా ఉండి ఆవురావురమని తింటున్న సమయంలో ఒకసారిగా వచ్చే...

ఎక్కిళ్ళను మనం చాలా సంధర్భంలో ఎదుర్కొన్న ఇబ్బందే. తినే సమయంలో అయితే ఆ బాధ మాటల్లో చెప్పలేము. ఆకలిగా ఉండి ఆవురావురమని తింటున్న

సమయంలో ఒకసారిగా వచ్చే ఎక్కిళ్ళు వల్ల తృప్తిగా తినలేము. సాధారణంగా, ఎక్కిళ్ళు కాసేపటి తరువాత ఆగిపోతాయి. కొన్ని సందర్భాలలో వచ్చే ఎక్కిళ్ళు చాలా సేపు ఇబ్బందిపెడతాయి. వాటిని తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఏంటో ఓసారి చూద్దాం...

* ఎక్కిళ్ళను తగ్గించేందుకు ఉపయోగపడే అత్యంత సులభమైన మార్గం శ్వాసను కాసేపు నొక్కిపెట్టకుని ఉండడం. శ్వాసని కంట్రోల్ చేయడం ద్వారా ఉపిరితిత్తుల్లో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల డయాఫ్రమ్ రిలాక్స్ అవుతుంది. తద్వారా ఎక్కిళ్ళు తగ్గుతాయి.

* స్పూన్ చక్కరతో కూడా ఎక్కిళ్ల సమస్యని దూరం చేయవచ్చు. మెదడుకు, కడుపుకు కనెక్ట్ అయి ఉన్న నరంపై చక్కర ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ చిట్కా పని చేస్తుంది.

* కాగితపు బ్యాగ్ లో శ్వాసని తీసుకోవడం ద్వారా కూడా వచ్చిన ఎక్కిళ్ళను కంట్రోల్ చేయవచ్చు. పేపర్ బ్యాగ్ లో శ్వాస తీసుకుంటే రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల డయాఫ్రమ్ లో ఉండే నొప్పి తగ్గుతుంది.

* ఛాతిని మోకాలి వరకు లాగడం ద్వారా కూడా ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. మోకాలపైకి ఛాతిని లాగి అలా కాసేపు ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత దాన్ని వదిలివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల డయాఫ్రమ్ మీద పడిన ఒత్తిడి కూడా తగ్గుతుంది.

* చిన్న నిమ్మకాయ ముక్కను తీసుకొని మీ నాలికపై పెట్టుకొని పీల్చడం ద్వారా పులుపు ద్వారా వచ్చే పులుపు ఎక్కిళ్ళపై తగ్గించుకోవచ్చు.

* తేనె తీసుకోవడం ద్వారా కూడా ఎక్కిళ్ళ బాధను తగ్గించుకోవచ్చు. టీస్పూన్ తేనెని గోరువెచ్చని నీళ్లలో కలిపి, ఆ మిశ్రమాన్ని తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

* చల్లటి నీళ్లను కొంచెం కొంచెం సిప్ చేస్తే ఎక్కిళ్ల సమస్య తగ్గించుకోవచ్చు. ఇది ఎంతో చాలా సులభమైన పద్ధతి. చల్లటి నీళ్లను నొట్లో పుక్కిలించడం ద్వారా కూడా ఎక్కిళ్లు ఉపశమనం పోందవచ్చు

ఇప్పటినుంచి ఎక్కిళ్ళు వస్తే వీటిలో ఏ చిట్కా అయినా పాటించడానికి ట్రై చేయండి. దాంతో, ఎక్కిళ్ల బాధ నుంచి మీకు విముక్తి కలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories