షుగర్‌కి చెక్‌ పెట్టే సహజ పద్ధతులేంటి?

షుగర్‌కి చెక్‌ పెట్టే సహజ పద్ధతులేంటి?
x
Highlights

షుగర్‌ వ్యాధి ఒకసారి వచ్చిందంటే ఒదలదు. అటువంటి షుగర్‌ మన ఒంట్లోకి వచ్చే వరకుఉండడం కంటే అసలు రాకుండా చూసుకుంటే మంచిది కాదా. అందుకే ప్రివెన్షన్ ఈజ్...

షుగర్‌ వ్యాధి ఒకసారి వచ్చిందంటే ఒదలదు. అటువంటి షుగర్‌ మన ఒంట్లోకి వచ్చే వరకుఉండడం కంటే అసలు రాకుండా చూసుకుంటే మంచిది కాదా. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అన్నారు మన పెద్దలు. ఇపుడు చక్కెర వ్యాధి అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే కామన్ వ్యాధిగా మారిపోయింది. అధిక బరువు , ఆహార అలవాట్లు , శరీరానికి శ్రమ లేకపోవడం , స్మోకింగ్‌ , ఆల్కహాల్‌ , మానసికఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది

షుగర్‌ వ్యాధిబారిన పడుతున్నారు. అందుకే షుగర్ రాకముందునుంచే జాగ్రత్త పడడం చాలా అవసరం. అందుకోసమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది.. ఎన్నోలాభాలుంటాయి.. వాటిని రెగ్యులర్‌గా పాటిస్తే సమస్య చాలా వరకూ దూరమవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముందుగా ఆహారం విషయానికి వస్తే...మాములు రైస్‌ కాకుండా బ్రౌన్‌రైస్‌ ను మెనూలో చేర్చుకోండి. ఇవి తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు

ముఖ్యంగా స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వారు చెక్కెరతో చేసిన పదార్ధాలను కాకుండా బెల్లంతో, తేనెతో చేసిన స్వీట్స్‌ను తిసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇక ప్రతి రోజు మజ్జిగ తాగాలి...అయితే ఆ పెరుగు కూడా బయట దొరికేది కాకుండా.. ఇంట్లో తోడుపెట్టిందైతే ఆరోగ్యానికి మంచిది. అలాగే ప్రతి రోజు వ్యాయామం చేస్తే ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది..ఒత్తిడి తగ్గుతుంది. వీలైనంత వరకు చెడు వ్యసనాలకు అలవాటు పడకండి...వాటి వల్ల ఒరిగే పెద్ద ప్రయోజనైలైతే ఏమి లేవు..నష్టలే తప్ప..అందుకే వీటి జోలికి వెల్లకపోవడమే మంచిది...ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల షుగర్ కి ఎంచక్కా చెక్ పెట్టేయోచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories