రెస్టారెంట్‌ లాంటి టేస్ట్‌తో వేడి వేడి మటర్ పనీర్.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..

Hot hot matar paneer with restaurant like taste make it like this at home
x

రెస్టారెంట్‌ లాంటి టేస్ట్‌తో వేడి వేడి మటర్ పనీర్.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..

Highlights

Matar Paneer:రెస్టారెంట్‌ లాంటి టేస్ట్‌తో వేడి వేడి మటర్ పనీర్.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..

Matar Paneer: ఈ న్యూ ఇయర్‌కి ఎవరైనా స్పెషల్‌ గెస్ట్‌ వస్తే వారికి వెరైటీ వంటకం మటర్ పన్నీర్‌ చేసి ఆశ్చర్యపరిచండి. ఇది చాలా సులువుగా ఇంట్లోనే తయారుచేయవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ వంటకం ఉదయం టిఫిన్‌గా సాయంత్రం స్నాక్‌గా డైట్‌ ప్లానింగ్‌ చేసేవారికి రాత్రి ఫుడ్‌గా కూడా తీసుకోవచ్చు. చలికాలంలో వేడి వేడిగా చాలా బాగుంటుంది. దీనిని ఎలా తయారుచేయాలో ఒక్కసారి తెలుసుకుందాం.

కావాలసిన పదార్థాలు.

200 గ్రాముల పనీర్, జీడిపప్పు, రైస్, మసాలా దినుసులు, బే ఆకు, దాల్చిన చెక్క, లవంగం, నల్ల మిరియాలు,

పచ్చిమిర్చి , ఎర్ర మిరపకాయ, ధనియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, 100 గ్రాముల బఠానీలు, ఉల్లిపాయ, నిమ్మ, ఉప్పు రుచి ప్రకారం పడుతుంది.

ఎలా చేయాలో తెలుసుకుందాం

ముందుగా బాణలిలో నూనె వేసి అందులో పనీర్ వేయించాలి. తర్వాత జీడిపప్పు, ఎండుద్రాక్ష కొద్దిగా వేయించాలి. మరోవైపు బియ్యం ఉడకబెట్టాలి. ఇప్పుడు బాణలిలో బే ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎర్ర మిరపకాయలు, ధనియాల పొడి వేయాలి. అందులో ఉల్లిపాయ కూడా వేయాలి. ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మీకు కావాలంటే క్యారెట్‌ ముక్కలను కూడా కలపవచ్చు. అలాగే ఉప్పు సరపడ వేయాలి. ఇప్పుడు అందులో ఉడికించిన అన్నం, పనీర్, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలపాలి. కాసేపు మిక్స్ చేసి తక్కువ మంట మీద ఉడికించాలి. కొంత సమయం తరువాత మీ అన్నం సిద్ధంగా ఉంటుంది. అంతే రుచికరమైన మటర్ పనీర్ రెడీ. వేడి వేడిగా వడ్డించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories