Honeymoon Trip: పర్వత ప్రాంతాల్లో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి

Honeymoon Trip
x

Honeymoon Trip: పర్వత ప్రాంతాల్లో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి

Highlights

Honeymoon Trip: పెళ్లి అయ్యాక నూతన వధూవరులు కలిసి ఆనందంగా గడపడానికి హనీమూన్ వెళ్తారు. ఇది ఒక ప్రత్యేకమైన గుర్తుండిపోయే అనుభవం. హనీమూన్ సాధారణంగా పెళ్లి అయ్యాక కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది.

Honeymoon Trip: పెళ్లి అయ్యాక నూతన వధూవరులు కలిసి ఆనందంగా గడపడానికి హనీమూన్ వెళ్తారు. ఇది ఒక ప్రత్యేకమైన గుర్తుండిపోయే అనుభవం. హనీమూన్ సాధారణంగా పెళ్లి అయ్యాక కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది. చాలామంది నూతన వధూవరులు హనీమూన్ కోసం విదేశాలకు వెళ్తారు. బీచ్లు, పర్వతాలు, లేదా ఇతర ఆసక్తికరమైన ప్రదేశాలకు వెళ్తారు. హనీమూన్ ద్వారా వధూవరులు ఒకరినొకరు మరింతగా తెలుసుకుంటారు. తమ సంబంధాన్ని బలపరుచుకుంటారు. జీవితంలో గుర్తుండిపోయేలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుంటారు. మీరు కూడా పర్వత ప్రాంతాల్లో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే, ఈ ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి..

ఈ ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి..

* హనీమూన్ ప్లాన్ చేసుకునేటప్పుడు మీ భద్రత విషయంలో రాజీ పడకుండా ఉండటం చాలా ముఖ్యం.

* మీకు తెలియని ప్రదేశాలకు వెళ్లకూడదని గుర్తుంచుకోండి. హోటల్ బుకింగ్ నుండి రిటర్న్ టికెట్ వరకు ప్రతిదీ ముందుగానే ప్లాన్ చేయండి.

* పర్వతాలలో ప్రయాణించేటప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోండి. అలాగే పర్యాటక ప్రదేశాల నుండి హోటల్ స్థానం ఎంత దూరంలో ఉందో తెలుసుకోండి.

* మీరు వెళ్లే ప్రదేశం గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోండి. స్థానికులతో మాట్లాడండి. అక్కడ ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళకూడదు? ఎలా వెళ్ళాలి ఇలా ప్రతిదీ ముందుగానే ప్లాన్ చేయడం చాలా ముఖ్యం.

* ట్రిప్‌కి వెళ్ళిన తర్వాత మీ లైవ్ లొకేషన్‌ను కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడితో ఖచ్చితంగా షేర్ చేయండి.

* పాస్‌పోర్ట్, వీసా, ఆధార్ కార్డు వంటి ప్రయాణానికి అవసరమైన వాటిని రెడీగా పెట్టుకోండి.

* కొండ ప్రాంతాలలో సాహసయాత్రలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రోడ్లు వంకరలు, ఇరుకుగా ఉంటాయి. ఎత్తుతో పాటు ఉష్ణోగ్రత, వాయు పీడనం మారుతుంది. ప్రదేశాలు ప్రమాదకరమైనవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

* మీరు పర్వతాలలో హనీమూన్ కోసం వెళుతున్నట్లయితే ఖచ్చితంగా స్థానిక గైడ్ సహాయం తీసుకోండి. పర్వత ప్రాంతాలలో ప్రయాణించడం కొన్నిసార్లు సవాలుగా ఉంటుంది. స్థానిక గైడ్ సహాయంతో మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories