చెమట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ?

చెమట మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ?
x
Highlights

చాలా మందికి సులభంగా చెమట వస్తుంది. ఏ కాలంలోనైనా సరే వారికి చెమట కారిపోతునే ఉంటుంది. దీంతో చాలా మందికి చెమ‌ట ఓ స‌మ‌స్యగా మారింది. ఫ్యాన్ లేదా కూల‌ర్...

చాలా మందికి సులభంగా చెమట వస్తుంది. ఏ కాలంలోనైనా సరే వారికి చెమట కారిపోతునే ఉంటుంది. దీంతో చాలా మందికి చెమ‌ట ఓ స‌మ‌స్యగా మారింది. ఫ్యాన్ లేదా కూల‌ర్ తిరుగుతూ ఉన్న‌ప్ప‌టికీ చెమ‌ట బాగా ప‌డుతుంటుంది.ఏం చేయాలో తెలియ‌క చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆ సమస్య తగ్గించుకోవచ్చు. మ‌రి ఆ చిట్కాలు చూద్దాం...

1 ప్రతి రోజు భోజనానికి ముందు 2 టీస్పూన్ల వెనిగ‌ర్‌, 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను క‌లిపి తాగితే చెమ‌ట ఎక్కువ‌గా రాదు.

2. నిత్యం ఏదో ఒక స‌మ‌యంలో 1 గ్లాస్ ట‌మాటా జ్యూస్‌ను తాగిడం వల్ల అధికంగా చెమ‌ట ప‌ట్ట‌కుండా ఉంటుంది.

3. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమ‌ట ఎక్కువ‌గా బాధపెట్టదు

4. కార్న్ స్టార్చ్‌, బేకింగ్ సోడాల‌ను కొద్దిగా తీసుకుని వాటిని బాగా క‌లిపి మిశ్ర‌మంగా తీసుకోవాలి. దాన్ని చంక‌ల్లో రాసుకోవాలి. చంకల్లో ఎలాంటి త‌డి ఉండకుండా చేసుకుని ఆ మిశ్ర‌మాన్ని రాయాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో క‌డ్కుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.

5. గోధుమ గ‌డ్డి జ్యూస్‌ను తాగడంతో పాటు పొటాషియం ఎక్కువ‌గా ఉండే అర‌టి పండ్లను ఆహారంగా తీసుకోవడం ద్వారా చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌కుండా చూసుకోవ‌చ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories