Top
logo

గ్యాస్ స‌మ‌స్య‌ను త‌గ్గించే చిట్కాలు.

గ్యాస్ స‌మ‌స్య‌ను త‌గ్గించే  చిట్కాలు.
X
Highlights

గ్యాస్‌, ఎసిడిటీ ఈ సమస్యలు మనిషి కుదురుగా ఉండనివ్వవు. ఒక ప‌ట్టాన మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తాయి. పని ఆసక్తి...

గ్యాస్‌, ఎసిడిటీ ఈ సమస్యలు మనిషి కుదురుగా ఉండనివ్వవు. ఒక ప‌ట్టాన మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తాయి. పని ఆసక్తి లేకుండా చేస్తాయి. ఏది తిన్నా,తాగిన గుండెల్లో ఏదో ప‌ట్టేసిన‌ట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఇది తగ్గడం కోసం రకారకాల మందులు వాడుతుంటారు. కానీ అవేమి లేకుండానే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే పై స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అదెలాగంటే…

గ్యాస్‌, అసిడిటీ, గుండెల్లో మంట ఇలాంటి లక్షాణాలు కనిపించనప్పుడు నీటిని బాగా తాగుతుండాలి. దీంతో జీర్ణాశ‌యంలో అధికంగా ఉత్ప‌త్తి అయ్యే యాసిడ్ల ప్ర‌భావం త‌గ్గి స‌మస్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య ఉన్న‌వారు ఎక్కువ సేపు ప‌డుకోరాదు. ఎంత సేపు వీలైతే అంత సేపు కూర్చుంటు ఉండాలి. దీంతో గ్యాస్ పైకి రాకుండా ఉంటుంది. పైనాపిల్ జ్యూస్ తాగ‌డం ద్వారా గ్యాస్ స‌మ‌స్య నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. క‌ల‌బంద‌ జ్యూస్‌ను తాగడం వల్ల మూడు స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గ్యాస్‌, గుండెల్లో మంట‌గా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను క‌లుపుకుని తాగుతూ ఉండడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. గ్లాస్ నీటిలో నిమ్మ‌కాయ రసాన్ని పిండి తాగితే గ్యాస్ నుంచి త‌క్ష‌ణ‌మే రిలీఫ్ ల‌భిస్తుంది.ద్రాక్ష పండ్ల‌ను తింటే వెంట‌నే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది.ఇలాంటి చిట్కాలు పాటించడం ద్వారా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Next Story