Holi: హోలీకి ఈ జాగ్రత్తలు తీసుకోండి.. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి

Holi: హోలీకి ఈ జాగ్రత్తలు తీసుకోండి.. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి
x

Holi: హోలీకి ఈ జాగ్రత్తలు తీసుకోండి.. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి

Highlights

Holi 2025: హోలీ వేడుకల కోసం అందరూ సిద్ధమవుతున్నారు. రంగులను ఒకరిపై మరొకరు జల్లుకోవడం చూడ్డానికి ఎంతో బాగుంటుంది.

Holi 2025: హోలీ వేడుకల కోసం అందరూ సిద్ధమవుతున్నారు. రంగులను ఒకరిపై మరొకరు జల్లుకోవడం చూడ్డానికి ఎంతో బాగుంటుంది. అయితే హోలీ ఆడిన తర్వాత ఆ రంగుల ప్రభావం చర్మంపై ఎక్కువగా పడుతుంది. ఈ రంగుల్లో ఉపయోగించే రసాయనాలు చర్మం, జుట్టు, గోళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే హోలీ వేడుకల్లో పాల్గొనే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల బారినపడకుండా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హోలీకి ఉపయోగించే రంగుల్లో చాలావరకు కెమికల్స్‌తో ఉండటంతో చర్మం పొడిగా, జుట్టు రఫ్‌గా మారుతుంది. ఈ ప్రభావం పూర్తిగా తొలిగిపోవడానికి కొన్ని సందర్భాల్లో వారాలు పడుతుంది. అయితే కొబ్బరి నూనెతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. హోలీకి రంగులతో ఆడే ముందు కొబ్బరి నూనెను ముఖం, మెడపై మృదువుగా మసాజ్ చేయాలి. ఇది చర్మంపై రక్షణ పొరగా పనిచేస్తుంది.

జుట్టుకు కొబ్బరి నూనెను బాగా రాయడం వల్ల రంగు నేరుగా జుట్టుకు అంటకుండా ఉంటుంది. హోలీ తర్వాత నూనెతో మళ్లీ మసాజ్ చేసి, 30–40 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత లైట్‌ షాంపూతో కడిగేయాలి. అంతే రంగు సులభంగా తొలగిపోతుంది. సన్‌స్క్రీన్‌ కూడా బాగా ఉపయోగపడుతుంది. హోలీ ఆడే 20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల చర్మంపై రసాయనాల ప్రభావం తక్కువగా పడుతుంది.

సాధారణ చర్మం కోసం SPF 20–30 సరిపోతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు SPF 30 లేదా 40 వరకు వాడొచ్చు. మాయిశ్చరైజింగ్ గల సన్‌స్క్రీన్‌ను ఎంచుకుంటే చర్మంపై హాని పడకుండా ఉంటుంది. ఈ సింపుల్‌ టిప్స్ పాటించి ఈ హోలీని మరింత సంతోషంగా జరుపుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories