ఆ రెండు తలల పురుగు.. వేసవిలో వనమూలిక..

ఆ రెండు తలల పురుగు.. వేసవిలో వనమూలిక..
x
Highlights

చాలా అరుదుగా లభించే వనమూలిక యార్సాగుంబా. హిమాలయా వయాగ్రా పేరుగాంచిన యార్సాగుంబా కిలో ధర రూ. 60 లక్షల వరకు ఉంటుంది. చాలా విలువైన మూలికలు కావడంతో.....

చాలా అరుదుగా లభించే వనమూలిక యార్సాగుంబా. హిమాలయా వయాగ్రా పేరుగాంచిన యార్సాగుంబా కిలో ధర రూ. 60 లక్షల వరకు ఉంటుంది. చాలా విలువైన మూలికలు కావడంతో.. నేపాలీలు ప్రాణాలకు తెగించి మరీ వీటి కోసం వెళ్తుంటారు. నిజానికి యర్సాగుంబా అంత ఈజీగా దొరకదు. దాని కోసం నేపాలీలు.. చిన్నాపెద్దా అంతా కలిసి పర్వతాలపై ఉదయం నుంచీ సాయంత్రం వరకూ వేట సాగిస్తారు. అలా వెతికితే.. ఒక్కో వ్యక్తికీ రోజుకి ఒకటీ లేదా రెండు మాత్రమే దొరుకుతాయి. అందుకే దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ వుంది. పసుపు పచ్చ రంగులో ఉండే ఇది బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడంతో పాటు పుష్కలమైన ఔషధ గుణాలు ఈ మూలిక సొంతం.

గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. చైనాలో డాంగ్‌ ఛాంగ్‌ అనే రెండు తలల పురుగు ఉంటుంది. దీనిని వేసవి గడ్డి, చలికాలపు పురుగు అంటారు. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్‌ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది.

నేపాల్‌ రాజధాని ఖట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో ఉండే డోప్లా జిల్లాలో యార్సాగుంబా సేకరణదారులు ఎక్కువగా ఉంటారు. అయితే ఈ సహజ సిద్ధ వయాగ్రా గొప్పదనాన్ని తెలుసుకున్న చైనా.. యర్సాగుంబాలను తెగ వాడేస్తోంది. వీటిని పొడి చేసి వంటల్లో ఉపయోగిస్తున్నారు. చైనా తర్వాత ఇండియా, అమెరికా, యూరప్ దేశాలు దీన్ని ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories