గురకకు విరుగుడు ఏంటంటే...

గురకకు విరుగుడు ఏంటంటే...
x
Highlights

గురక చాలా మందిని వేధించే ప్రధాన సమస్య. , గురక పెట్టడం వల్ల పక్క వారికి కూడా నిద్రపట్టదు. కోపం, చిరాకు మనపై చూపిస్తారు. నిద్రలో గురక రావడానికి ప్రధాన...

గురక చాలా మందిని వేధించే ప్రధాన సమస్య. , గురక పెట్టడం వల్ల పక్క వారికి కూడా నిద్రపట్టదు. కోపం, చిరాకు మనపై చూపిస్తారు. నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పలువురు పరిశోధకులు చెబుతున్నారు. దీనికితోడు సమయానికి తగినట్టుగా ఆహారం తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. రాత్రి నిద్రపోయే ముందు అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

రెండు టీస్పూన్ల పసుపు పొడిని గ్లాసు వేడి పాలలో కలిపి త్రాగినా గురక తగ్గుతుంది. అలాగే అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది. మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు పీల్చితే గురక తగ్గిపోతుంది. ఆవు నెయ్యిని కరిగేలా కొద్దిగా వేడి చేసి రోజూ రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో వేసి పీల్చితే గురక నుండి ఉపశమనం పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories