ఇలాంటి ఆహారం తీసుకుంటే నిద్ర హాయిగా నిద్రపడుతుంది..

ఇలాంటి  ఆహారం  తీసుకుంటే నిద్ర హాయిగా నిద్రపడుతుంది..
x
Highlights

నిద్ర అనేది మ‌న‌కు అత్యంత ఆవ‌శ్య‌క‌మైంది. రోజుకు క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. అది పిల్ల‌లు, వృద్ధులకు అయితే 8 నుంచి 10 గంట‌ల పాటు...

నిద్ర అనేది మ‌న‌కు అత్యంత ఆవ‌శ్య‌క‌మైంది. రోజుకు క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. అది పిల్ల‌లు, వృద్ధులకు అయితే 8 నుంచి 10 గంట‌ల పాటు నిద్ర‌పోవాల్సి అవసరం ఉంటుంది. కానీ ప్ర‌స్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. నిద్రలేమి కారణంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ు తలేత్తున్నాయి.

టెన్షన్స్‌తో నిద్ర పట్టక మధ్యమధ్యలో మెలకువతో ఇబ్బంది పడుతుంటారు. అయితే నిద్రలో సమయంలో ఇబ్బంది పడకుండా పడుకున్నంత సేపైనా హాయిగా నిద్రపోవలంటే కింది సలహాలను పాటిచండి..

* ఆదమరిచి హాయిగా నిద్రపోవాలంటే ముందుగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనం రోజు తీసుకునే డైట్‌లో పోషక పదార్ధాలు ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో చూద్దాం...

* ఓట్స్‌.. ప్రశాంతమైన నిద్ర పొవడానికి బాగా ఉపయోగపడుతాయి. ఇందులోని విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, మెలటోనిన్ మెదడుని ప్రశాంతంగా ఉంచి నిద్రాభంగం లేకుండా చేస్తాయి.

* అరటి పండ్లలో మెగ్నీషియం, సెరటోనీన్, మెలటోనిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కావున వీటిని తినడం వల్ల మంచి నిద్రపడుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.

* బాదంలో ఉండే హెల్దీ ఫ్యాట్స్, మెగ్నీషియం మంచినిద్రకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని కూడా మీ డైట్‌లో ఉండేలా చూసుకోవడం మంచిది.

* మెలటోనిన్ అనే పదార్థం వాల్ నట్స్ సమృద్దిగా ఉంటుంది. ఇవి హాయిగా నిద్రపోయేందుకు దోహదం పడుతాయి.

* వాల్‌నట్స్‌లొ ఉన్నట్లే చెర్రీస్‌లో కూడా మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చెర్రీలను తినడం అలవాటు చేసుకోండి.

* నిత్య ఆహారంలో తేనే తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అందులోని మెలటోనిన్ ఆలోచనలను కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది.

* గుడ్లులోని అమైనో యాసిడ్స్ నిద్రపోయేందుకు దోహదం చేస్తుంది. రోజూ గుడ్డు తినడం వల్ల మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories