Heart: ఇలా చేస్తే జీవితంలో గుండెపోటు రాదు.. సింపుల్‌ టిప్స్‌..!

Heart Attack Prevention Simple Tips for a Healthy Heart and Lifestyle Changes
x

Heart: ఇలా చేస్తే జీవితంలో గుండెపోటు రాదు.. సింపుల్‌ టిప్స్‌..!

Highlights

Heart: ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు హార్ట్‌ ఎటాక్‌ కారణంగా మరణిస్తున్నారు.

Heart: ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు హార్ట్‌ ఎటాక్‌ కారణంగా మరణిస్తున్నారు. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకోసం జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ జీవితంలో గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం నిద్రలేచిన వెంటనే నడక, యోగా, ప్రాణాయామం, స్ట్రెచింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కనీసం 30-45 నిమిషాలు నడక లేదా తేలికపాటి కసరత్తులు చేయడం ఉత్తమం. వ్యాయామం ద్వారా రక్తప్రసరణ మెరుగవుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇక ఉదయం తీసుకునే టిఫిన్‌ విషయంలో కూడా కొన్ని టిప్స్‌ పాటించాలి. ముఖ్యంగా టిఫిన్‌లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవాలి.

ఓట్స్, గింజలు, డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు, తృణధాన్యాలు, గ్రీన్ టీ వంటి వాటిని అల్పాహారంలో చేర్చుకోవాలి. అధిక కొవ్వు, ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించాలి. ధ్యానం, ప్రాణాయామం వంటివి రెగ్యులర్‌గా పాటిస్తే మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. గుండెపోటుకు ప్రధాన కారణాల్లో ఒత్తిడి ఒకటి కావడంతో దాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. ఉదయం లేచిన వెంటనే 1-2 గ్లాసుల గోరు వెచ్చని నీళ్లు తాగితే మెటాబోలిజం మెరుగవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు రోజంతా తగినంత నీరు తాగడం అవసరం.

సరైన నిద్ర లేకపోతే కూడా గుండెపోటు ముప్పు పెరుగుతుంది. ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది. స్మోకింగ్, డ్రింకింగ్‌ వంటివి గుండె ఆరోగ్యానికి హానికరమైనవి. వీటి ప్రభావం నెమ్మదిగా గుండెపోటుకు దారితీస్తుంది. ఇక ఎప్పటికప్పుడు రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలి. కుటుంబంలో గుండె సమస్యలు ఉంటే, ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories