Top
logo

ఇలా భోజనం తిన్నారే అనుకోండి...

ఇలా భోజనం తిన్నారే అనుకోండి...
X
Highlights

ఆయుర్వేదం ప్రకారం మనం రోజు తీసుకునే ఆహారం మూడువిధాలుగా ఉండాలి నిర్దేశిస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణ...

ఆయుర్వేదం ప్రకారం మనం రోజు తీసుకునే ఆహారం మూడువిధాలుగా ఉండాలి నిర్దేశిస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణ సంబంధ బాధలు లేకుండా ఉండాలంటే మూడు ముఖ్యమయిన నియమాలను పాటించాలని ఆయుర్వేదం నిర్వచించింది. అవి ఏంటో ఓసారి చూద్దాం...

హితభుక్త.... ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని సుళువుగా జీర్ణమయ్యే దానిని హితభుక్తగా పేర్కొన్నారు.మితభుక్త... ఆహారం విషయంలో సమయపాలన పాటించడం. అవసరం మేరకే తినడం, అధికంగా తినకపోవడం, ఎక్కువసార్లు , ఎక్కువ పదార్థాలు తినకపోవడాన్ని మితభుక్తఋతుభుక్త... వివిధ సీజనల్ లభ్యమయ్యే ఆహారం తప్పనిసరిగా తినడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి ప్రసాదించే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఋతుభుక్తగా నిర్దేశించారు. ఈ విధంగా భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు.

ప్రస్తుత యాంత్రిక జీవనం మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.. బిజీ లైఫ్ స్టైల్‌ పెనుమార్పులు కారణమవుతుంది.. ఉద్యోగం, కుటుంబ వ్యవహారాలతో సగటు మానవుడు ఆరోగ్య పరిరక్షణపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.. ఉరుకుల పరుగుల జీవనం... శరీరానికి వ్యాయామం లేకపోవడం... వేళాకు లేని తిండి.. ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం... లేటు నిద్ర.. తదితర కారణాలతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే తాజా ఆహార పదార్ధాలను తీసుకోవాలి. పండ్ల రసాలు, కూరగాయల మన శరీరానికి శక్తినిచ్చేవే. ఓ గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తో విటమిన్-సి కావాల్సినంత లభిస్తుంది. అలాగే, కీరదోస, పాలకూర జ్యూస్ మనలోని వ్యర్థాలను పోగొడుతాయి. యాపిల్, బీట్ రూట్, క్యారట్ జ్యూస్ కలిపి తాగితే బరువు తగ్గుతారు. ఇలాంటి ఆహార నియమాలతో మంచి ఆరోగ్యాన్ని స్వంతం చేసుకోవచ్చు.

Next Story