తింటే రెండు గుడ్లు మాత్రమే తినాలి..!

తింటే రెండు గుడ్లు మాత్రమే తినాలి..!
x
Highlights

తింటే రెండు గుడ్లు మాత్రమే తినాలి..! తింటే రెండు గుడ్లు మాత్రమే తినాలి..!

ప్రోటిన్స్ అరోగ్యంగా ఉండానికి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వాటిని మన ఆహారంలో రోజు తీసుకుకోవడం వల్ల చాలా రకాల రోగాలు నివారించుకోవచ్చు. ప్రోటిన్స్ గుడ్డులో సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజూ కోడిగుడ్డు తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. శరీరానికి కావాల్సిన పోషకాహారాలన్ని గుడ్డులో ఉంటాయి.

అయితే పోషకారాలు ఉంటాయి కదా అని వాటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి ముప్పే. అధికంగా వాటిని తింటే మాత్రం ప్రమాదమే అంటున్నారు నిపుణులు. రోజులో ఎక్కువలో ఎక్కువ రెండు కోడి గుడ్లు తినవచ్చట. అంతకు మించి తింటే ప్రమాదం కొనితేచ్చుకున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ రెండు కంటే ఎక్కువ కోడిగుడ్లు తింటే గుండెకు ముప్పని తాజా సర్వే హెచ్చరిస్తోంది.

గుడ్లు ఎక్కువగా తింటే వచ్చే అనార్ధాలపై అమెరికన్ పరిశోధకుల వివరాలను అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించారు. 31ఏళ్లుగా దాదాపు 30వేల మంది తీసుకుంటున్న ఆహారం, వారి జీవన విధానంపై పరిశోధన చేశారు.. గుడ్లలో కొవ్వు పదార్థాలు ఉండడం అతిగా తీసుకుంటే చేటు చేస్తుందని మస్సాచుసెట్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కేథరినా టక్కర్‌ పేర్కొన్నారు. గుడ్లను అధికంగా తినేవారికి గుండెజబ్బులు 17% వచ్చే ఆస్కారం ఉందని, చనిపోయేందుకు కూడా 18% అవకాశం ఉందని వెల్లడించారు. అందువల్ల రోజుకు రెండు గుండ్లను మాత్రమే తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories