Health Tips: గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చుంటున్నారా? ఆరోగ్యానికి అలారమ్ బెల్స్ మోగుతున్నాయ్ జాగ్రత్త!

Health Tips: గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చుంటున్నారా? ఆరోగ్యానికి అలారమ్ బెల్స్ మోగుతున్నాయ్ జాగ్రత్త!
x

Health Tips: గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చుంటున్నారా? ఆరోగ్యానికి అలారమ్ బెల్స్ మోగుతున్నాయ్ జాగ్రత్త!

Highlights

ఆధునిక జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొందరు టాయిలెట్‌ను రిలాక్స్ ప్లేస్‌గా మార్చేసుకున్నారు. మొబైల్‌తో గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చోవడం ఇప్పుడు చాలామందికి అలవాటైపోయింది. దీనికి ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అనే పేరుకూడా వచ్చేసింది. అయితే, నిపుణుల హెచ్చరికల ప్రకారం ఈ అలవాటు తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

30 నిమిషాలకు మించి కూర్చుంటే వచ్చే ప్రమాదాలు

ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది.

నరాలపై ఒత్తిడి పడటం వలన తీవ్రమైన నొప్పులు వస్తాయి.

రక్తప్రసరణ తగ్గిపోవడం వల్ల పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఒక వ్యక్తి మద్యం సేవించి టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వలన పక్షవాతం వచ్చిన సంఘటన కూడా నమోదైంది.

సయాటిక్ నర్వ్ దెబ్బతిని కాళ్లలో తిమ్మిరి, జలదరింపు వంటి సమస్యలు వస్తాయి.

జాగ్రత్తలు పాటించాల్సినవి

టాయిలెట్ సీటుపై ప్యాడెడ్ కవర్ ఉపయోగించండి.

టాయిలెట్ తర్వాత కాళ్లు గట్టిపడినట్లుగా లేదా తిమ్మిరి వచ్చినట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ అలవాటు మానుకోవాలి.

టాయిలెట్‌లో మొబైల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించండి.

వైద్యుల సలహా ప్రకారం టాయిలెట్‌లో 10–15 నిమిషాలకు మించి కూర్చోవద్దు.

తాత్కాలిక రిలాక్స్ కోసం టాయిలెట్‌లో ఎక్కువసేపు గడపడం, మొబైల్ వాడటం వంటివి భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.

గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories