తాగుడు మానేయాలా.. అయితే ప్రేమించడంటున్న శాస్త్రవేత్తలు

తాగుడు మానేయాలా.. అయితే ప్రేమించడంటున్న శాస్త్రవేత్తలు
x
Highlights

ప్రేమించినప్పుడు ఉండే ఆనందం అంతా ఇంతా కాదు.. ప్రేమే ప్రపంచం అనుకుంటారు ప్రేమికులు. ప్రేమలో సక్సెస్ అయితే చావు త్వరగా రాదంటారు. మనిషికున్న జబ్బులను...

ప్రేమించినప్పుడు ఉండే ఆనందం అంతా ఇంతా కాదు.. ప్రేమే ప్రపంచం అనుకుంటారు ప్రేమికులు. ప్రేమలో సక్సెస్ అయితే చావు త్వరగా రాదంటారు. మనిషికున్న జబ్బులను సైతం తొలగించగల శక్తి ప్రేమకు ఉందని అంటుంటారు. ఈ విషయం అటుంచితే ప్రేమకు మద్యపానాన్ని మాన్పించే శక్తి ఉందంటా.. వినడానికి కామెడీగా ఉన్నా ఇది నిజమట.. అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, స్క్రిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రీసెర్చ్ చేసి మరి ఈ విషయం చెప్పారు. మనిషి శరీరంలో ప్రేమ పుట్టినప్పుడు..

తాగుడు మానేయాలా.. అయితే ప్రేమించడంటున్న శాస్త్రవేత్తలుఆక్సిటోసిన్ అనే హర్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మన్‌ కారణంగా ఆల్కహాల్ తీసుకోవాలనిపించదట.. దీంతో క్రమంగా మద్యపానం అలవాటు దూరమవుతుందట.. కొన్నిరోజుల కిందట ఎలుకలకి ఆల్కహాల్ అలవాటు చేశారట ఆ శాస్త్రవేత్తలు.. అనంతరం.. వాటి ముక్కు భాగంలో ఆక్సిటోసిన్ స్ప్రే చేశారు.. అనంతరం.. అవి మద్యానికి దూరంగా ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ప్రయోగంతో మనిషి కూడా ప్రేమ కలిగిఉంటే మద్యాన్ని మానేస్తాడని వారంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories