ఇలా చేస్తే పెళ్లి సమయానికి అందంగా మారడం ఖాయం

ఇలా చేస్తే పెళ్లి సమయానికి అందంగా మారడం ఖాయం
x
Highlights

పెళ్లి అనేది ప్రతి ఒక్క అమ్మాయి అందమైన కళ...కాబోయే వాడు అలా ఉండాలి..ఇలా ఉండాలి అంటూ ఎన్నో ఉహలు, కళలు కంటుంది. తీరా పెళ్లి సమయానికి వచ్చేసరికి...

పెళ్లి అనేది ప్రతి ఒక్క అమ్మాయి అందమైన కళ...కాబోయే వాడు అలా ఉండాలి..ఇలా ఉండాలి అంటూ ఎన్నో ఉహలు, కళలు కంటుంది. తీరా పెళ్లి సమయానికి వచ్చేసరికి ఎక్కడాలేని టెన్షన్, భయం , బెరుకు ఇంకా ఎన్నో ఆలోచనలతో సతమతమవుతుంది.. ఆ అందమైన కళ నిజం కాబోతున్న సమయంలో కలవరపడుతుంది...పెళ్లి పిక్స్ అయ్యిందని తెలియగానే టెన్షన్...దేనికి సమయం దొరకదు... అలా కాకుండా

పెళ్లి సమయానికి ఆరోగ్యంగా అందంగా ఉత్సాహంగా ఉండాలంటే మాత్రం అమ్మాయిలు కాస్త సమయాన్ని కేటాయించాలి..అప్పుడే ఆ కళను కన్నులారా ఆస్వాదించవచ్చు. మానసికంగా , శారీరకంగా ఫిట్‌గా ఉంటేనే ఆ మధురమైన మ్యాజిక్ మూమెంట్స్‌ను మనసారా ఎంజాయ్ చేయవచ్చు.

పెళ్లి సమయం సమీపిస్తున్నా కొద్ది అందరిలో ఒత్తిడి పెరుగుతుంది. అందుకనే పనులను పెండింలో పెట్టకుండా పనులను ప్రణాళికా ప్రకారం చేసుకుంటూ పోతే అంతే టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వొచ్చు. అమ్మాయిలు మరీ ముఖ్యంగా పెళ్లి షాపింగ్ కే ప్రియారిటీ ఇస్తారు. రోజుల తరబడి రాత్రి పగలు అన్న తేడా లేకుండా తెగ తిరిగేస్తుంటారు. కాబట్టి పెళ్లి సమయానికి ఫ/ల్ ప్రిపేర్‌గా ఉండాలంటే పనులన్నింటిని ఇతరులకు అప్పగించాలి..

పెళ్లి వచ్చే నెల అనేసరికి టైమ్ టు టైమ్ అన్నీ జరిగిపోతుండాలి..సమయానికి నిద్రపోవాలి.ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటుండాలి. రాత్రి త్వరగా పడుకుని...పొద్దున్నే నిద్ర లేవాలి..కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరం..ఇలా చేయడం వల్ల చక్కటి ఆరోగ్యం లభిస్తుంది.

ఇక ముఖ సౌందర్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రధానంగా తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదై ఉండాలి. ఏది పడితే అది తినడం తగ్గించుకోవాలి. ముఖ్యంగా టీలు, కాఫీలు తాగడం తగ్గించాలి. జంక్ ఫుడ్ జోలికి అస్సలే వెళ్లకూడదు.. పండ్లను, పండ్ల రసాలను ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు తింటుండాలి..తద్వారా మనం ఆరోగ్యం బాగుండటంతో పాటు చర్మం సౌందర్యవంతంగా తయారవుతుంది.

జొన్నలు, రాగులు, సజ్జుల, కొర్రలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రతి రోజు అరగంట లేదా పావుగంట సేపు వ్యాయామం చేస్తూ ఉండాలి..నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.... తద్వారా బరువును కూడా నియంత్రించుకోవచ్చు. ఇలాంటి కొన్ని టిప్స్ ను పాటిస్తే.. చాలు పెళ్లి సమయానికి ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా మారడం ఖాయం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories