కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పనిచేస్తున్నారా?

కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పనిచేస్తున్నారా?
x
Highlights

నేటి సాంకెతిక ప్రపంచంలో ప్రతి ఉద్యోగి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం తప్పనిసరిగా మారిపోయింది. అయితే కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసినా వారికి...

నేటి సాంకెతిక ప్రపంచంలో ప్రతి ఉద్యోగి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం తప్పనిసరిగా మారిపోయింది. అయితే కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసినా వారికి తలనొప్పి కళ్ళ అలసట రావడం సాధరణంగా అయింది. అందుకు కారణం కళ్లు ఓత్తిడికి గురయ్యాయని అర్థం. ఈ ఇబ్బందికి రాకుండా ఉండాలంటే. అలసట లక్షణాలను గుర్తించి కళ్లకు కాస్త విశ్రాంతిని ఇవ్వాలి. కంటి నుండి నీరు కారడం ,కళ్ల మసకలు, తలనొప్పి,, కంటి మంటలు లాంటి లక్షణాలు కనిపిస్తుంటే కళ్లు అలసిపోతున్నాయని గుర్తించాలి. దీనికి చాలా కారణాలుంటాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వాడడం కళ్ళ నొప్పికి ప్రధాన కారణాలు. బుక్‌లో ముద్రించిన చిన్న చిన్న అక్షరాలను చదవడం, వెలుతురు లేని చోట కూర్చుని చదవడం వంటి అలవాట్ల వల్ల కంటి కండరాల మీద ఒత్తిడికి లోనవుతాయి. దీంతో డబుల్ ఇమేజ్, తలనొప్పి, మైల్డ్ మ్రైగ్రేన్ వంటి లక్షణాలు వస్తాయి.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే..కంటి మీద పడే ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి. కంప్యూటర్ ముందు అదేపనిగా పనిచేసే వాళ్లు ప్రతిరెండు గంటలకోసారి పని ఆపేసి కనీసం 10 నిమిషాలు కళ్లకు విశ్రాంతిని ఇవ్వాలి.

అప్పుడప్పుడూ కంటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. కళ్లను మూసి రెండు దోసిళ్లను కళ్ల మీద ఉంచి మోచేతులను టేబుల్ మీద ఆనించి 5 నిమిషాల పాటు అలానే ఉండాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.

కంటి నుండి నీరు కారుతున్నప్పుడు కానీ దురదలు వస్తున్నప్పుడు కళ్లు నులుముకోకుండా వైద్యుల్ని సంప్రదించాలి. కళ్ళకు విశ్రాంతి లభించేలా రోజుకు కనీసం ఏడు గంటలపాటైనా నిద్రపోవాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories