ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని తింటున్నారా..?

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని తింటున్నారా..?
x
Highlights

ఫ్రిజ్‌ చాల మంది ఇంట్లో ఉంటుంది. ఇంటిలో ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని వండుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుని తరువాత తినే వాళ్లు ఉన్నారు. కొంత మంది బయటి నుంచి...

ఫ్రిజ్‌ చాల మంది ఇంట్లో ఉంటుంది. ఇంటిలో ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని వండుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుని తరువాత తినే వాళ్లు ఉన్నారు. కొంత మంది బయటి నుంచి తెప్పించుకొనే ఆహారాన్ని కూడా ఫ్రిజ్ లో పెట్టుకుని మరీ తింటారు. కొన్ని వంటకాలు అయితే రెండు మూడు రోజులు తరువాత కూడా తినేవాళ్లు ఉన్నారు. మరి కొంత మంది అయితే వారాల తరబడి ఫ్రిజ్ లో ఉంచుకుని తింటారు.

అయితే ఫ్రిజ్‌లో ఆహారాన్ని ఎక్కువ సేపు పెట్టడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫ్రిజ్ లో పెడితే ఆహారం పాడైపోవడం నెమ్మదిస్తుందిగాని.. పూర్తిగా ఆగిపోదంటున్నారు నిపుణులు. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఎంత తక్కువసేపు పెడితే అంత మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మగవారు వంటగదిలో సాయం చేస్తే, ఫ్రిజ్, మైక్రోవేవ్ లాంటివి అవసరమే ఉండదట. అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే.. బాగా వండిన తాజా ఆహారాన్నే మాత్రమే తినాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories