Health care: బిర్యాని తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి తినొద్దు

Health care
x

Health care: బిర్యాని తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి తినొద్దు

Highlights

Health care: చాలామంది ఫుల్‌గా బిర్యాని తినేసి ఇంకా అక్కడ ఏముంటే అవి తినేస్తూ ఉంటారు. కానీ బిర్యాని తర్వాత కొన్ని రకాల ఆహార పదార్ధాలు తింటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

Health care: చాలామంది ఫుల్‌గా బిర్యాని తినేసి ఇంకా అక్కడ ఏముంటే అవి తినేస్తూ ఉంటారు. కానీ బిర్యాని తర్వాత కొన్ని రకాల ఆహార పదార్ధాలు తింటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బిర్యానీ. ఇది చాలా రుచికరమైన అలాగే హెవీ ఫుడ్. దీంతో బిర్యాని తిన్న తర్వాత సాధారణంగా ఆ రోజంతా ఏమీ తినలేరు. కానీ కొంతమంది బిర్యానీ తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినేస్తూ ఉంటారు. అయితే ఇలా తింటే లేని పోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిర్యానీ తిన్న తర్వాత తినకూడని ఆహారాలు:

కూల్ డ్రింక్స్

చాలామందికి బిర్యానీతో ధమ్సప్ లేనిదే ముద్ద దిగదు. కానీ బిర్యానీ తిన్న వెంటనే లేదా బిర్యానీ తింటున్నప్పుడు కూల్ డ్రింక్స్ దాగకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే చక్కెర, కార్బోనేటేడ్ పదార్దాలు జీర్ణక్రియను సక్రమంగా చేయనీయవ్వు. దీంతో వాంతులు, తలతిరగడం, తలనొప్పి వంటి వస్తాయి. తిన్న తర్వాత ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్లు ఆహారం తిన్నతర్వాత ఏం తిన్నారో గుర్తు చేసుకుని, మళ్లీ ఇంకొక సారి తినకుండా ఉండాలి.

పాలు, మజ్జిగ, పెరుగు

బిర్యానీ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు, మజ్జిగ, పెరుగు వంటి పదార్ధాలు తినొద్దు. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మాంసం తిన్న తర్వాత పాలు పదార్ధాలు తింటే కడుపులో గ్యాస్ పెరిగిపోతుంది. అలాగే ఉబ్బరం, అజీర్ణ సమస్యలు వస్తాయి.

వేపుడు పదార్ధాలు

బిర్యానీ తిన్న తర్వాత ఎటువంటి వేపుడు పదార్ధాలు లేదా నూనెలో వేయించిన పదార్ధాలు తినకూడదు. దీనివల్ల కడుపులో లేదా గుండెలో మంట వస్తుంది.

తీపి పదార్ధాలు

బిర్యాని తిన్న వెంటనే ఎటువంటి తీపి పదార్ధాలు తినకూడదు. ముఖ్యంగా ఖీర్, రసమలై, ఐస్ క్రీం వంటి తినకుండా ఉంటేనే మంచిది. దీనివల్ల రక్తంలో సుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.

వేడి టీ

చాలామందికి తిన్న వెంటనే వేడి వేడిగా టీ తాగాలని ఉంటుంది. అందుకే వెంటనే టీ చేసుకుని తాగేస్తూ ఉంటారు. కానీ బిర్యాని తిన్న వెంటనే టీ తాగితే అందులో ఉండే కెఫిన్, టానిన్లు సరిగ్గా జీర్ణం చేయనివ్వవు. దీంతో చాలాసేపు పొట్టలోనే ఆహారం ఉన్నట్లు ఉంటుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

పుల్లని పండ్లు

బిర్యానీ తిన్న తర్వాత సిట్రస్ ఉండే పుల్లని పండ్లను తినకూడదు. ఇవి యాసిడ్ ను రిలీజ్ చేస్తాయి. దీనివల్ల గుండెలో మంటగా ఉంటుంది.

అయితే.. ఏం తినాలి?

బిర్యాని తిన్న తర్వాత సోంపు తినాలి. ఇది బిర్యానీ జీర్ణం కాడానికి తోడ్పడుతుంది. తేలికపాటి ఆహారాలు, తక్కువ మోతాదులో పండ్లు తినాలి. అంతేకాదు బిర్యానీ తిన్న వెంటనే నీళ్లుకూడా తాగకూడదు. ఏదైనా ఒక ఆహారం తిన్న అరగంట లేదా గంట తర్వాత తినడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories