ఆరోగ్యానికి మునగాకు సూప్..

ఆరోగ్యానికి మునగాకు సూప్..
x
Highlights

పాల‌క‌న్నా 17 రెట్లు ఎక్కువ కాల్షియం మున‌గాకు ద్వారా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. మున‌గాకులో ప్రోటీన్లు కూడా ఎక్కువే. అర‌టిపండ్ల క‌న్నా...

పాల‌క‌న్నా 17 రెట్లు ఎక్కువ కాల్షియం మున‌గాకు ద్వారా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. మున‌గాకులో ప్రోటీన్లు కూడా ఎక్కువే. అర‌టిపండ్ల క‌న్నా 15 రెట్లు అధికంగా పొటాషియం మ‌న‌కు మున‌గాకు ద్వారా అందుతుంది. ఐదు రకాల క్యాన్సర్లకు మునగాకు మంచి మందుగా పనిచేస్తుంది. గర్భీణులకు, బాలింతలకు మునగాకు రసం ఎంతో మంచిది. వారికి అవసరం అయిన క్యాల్షియం, ఐరన్‌, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

కావలసిన పదార్ధాలు :

ఒక కట్ట మునగాకు

10 చిన్న ఉల్లిగడ్డలు

20 వెల్లుల్లి రెబ్బలు

ఒక టమాట

పెసరపప్పు

జీలకర్ర

మిరియాలు

తయారీ విధానం :

స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి.. నూనె పోసుకోావలి. ఇందులో టమాట ముక్కలను కట్ చేసి వేసుకోవాలి. ఇప్పడు జీలకర్ర, పెప్పర్ ను వేసుకోవాలి. తరువాత వెల్లుర్లి రెబ్బలు, చిన్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఆ తరువాత పసుపు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు నీటిలో నానబెట్టి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి....వీటన్నింటిని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ పూర్తైన తరువాత మూత తీయాలి. ఇప్పుడు ఈ సూప్‌ను వడకట్టుకోవాలి. బౌల్ లోకి తీసుకుందాం. మునగాకు సూప్ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories