బెండకాయల్లో ఫైబర్ ఎక్కువ

బెండకాయల్లో ఫైబర్ ఎక్కువ
x
Highlights

అన్ని సీజన్లలో దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి. బెండకాయల్ని ఎలా తిన్నా వాటిలో పోషకాలు కొంతవరకూ మనకు అందుతాయి. ఐతే పూర్తిగా పోషకాలు అందాలంటే మాత్రం...

అన్ని సీజన్లలో దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి. బెండకాయల్ని ఎలా తిన్నా వాటిలో పోషకాలు కొంతవరకూ మనకు అందుతాయి. ఐతే పూర్తిగా పోషకాలు అందాలంటే మాత్రం వాటిని నానబెట్టిన నీటిని తాగాలి.. ఇందుకోసం బెండ‌కాయ‌ల‌ు రెండు లేదా మూడు తీసుకుని, బాగా క‌డిగి, వాటి మొద‌లు, చివ‌రల్ని తీసేయాలి. వాటిని నిలువుగా క‌ట్ చేసుకోవాలి. ఆ ముక్కలను గ్లాస్ నీటిలో వెయ్యాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని నీటిలో ఉంచితే... అవి బాగా నాని... వాటిలో పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఉదయాన్నే నీటిలోని బెండ ముక్కల్ని తీసేసి... నీటిని తాగాలి. అప్పుడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి.

ఈ బెండకాయ వాటర్... మన పొట్టలో పేగులు, జీర్ణాశయాన్ని శుభ్రపరుస్తాయి. గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. బెండకాయల్లో ఫైబర్ ఎక్కువ. అది ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెండ‌కాయ‌ల‌ను నాన‌బెట్టిన నీటిని తాగ‌డం వ‌ల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. గుండె పదిలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కూడా బెండకాయల్ని నానబెట్టిన నీరు ఎంతో మేలు చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి... షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే బెండకాయ వాటర్ తాగాలి. కంటి చూపు సమస్య ఉన్నవారు రోజూ ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. స్కిన్, హెయిర్‌కి కూడా ఈ నీరు ప్రయోజనాలు కలిగిస్తుంది. బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు... చల్లబరిచేందుకు బెండకాయ నీరు ఉపయోగపడుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories