ఆ పువ్వులను ఉపయోగిస్తే అందం మీ సొంతం!

ఆ పువ్వులను ఉపయోగిస్తే అందం మీ సొంతం!
x
Highlights

అందంగా కనిపించడం కోసం.. ముఖానికి ఫేస్ ప్యాక్ ఉపయోగించే అమ్మాయిలు చాలమంది ఉన్నారు. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ప్రయోగాలను చేసే వారు ఉన్నారు....

అందంగా కనిపించడం కోసం.. ముఖానికి ఫేస్ ప్యాక్ ఉపయోగించే అమ్మాయిలు చాలమంది ఉన్నారు. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ప్రయోగాలను చేసే వారు ఉన్నారు. అలాంటి ప్రయోగాల్లో పువ్వులు కూడా ఒకటి. చాలమంది రోజ్ వాటర్‌ని ఉపయోగిస్తుంటారు. రోజ్ వాటర్ ను అందాన్ని మెరుగుపరుచుకోవడానికి, చర్మ సుభ్ర పరుచుకోవడానికి అనేక రకాల ఫేస్ ప్యాక్ లలో ఉపయోగిస్తారు. గులాబీ వాటర్ లాగే కొన్ని రకముల పువ్వులు కూడా చర్మంలో అద్భుత మార్పులు తీసుకురాగలవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గులాబీ తో పాటు మందారం, బంతిపువ్వు, తామరపువ్వు, మల్లేపూలతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

మందారంతో ఫేస్ ప్యాక్ కావల్సిన పదార్థాలు:

1 టీస్పూన్ మందారంపువ్వును పౌడర్ చేసినది, 1/4 కప్పు బ్రౌన్ రైస్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 ఫ్రెష్ అలోవెర జెల్

రిసిపి: మందరం పువ్వు ప్యాక్ తయారీ కోసం ఒక వారం ముందు నుండే తయారుచేసుకోవాలి. ఫ్రెష్ గా ఉన్న మందారం పువ్వులు తీసుకుని, ఎండబెట్టాలి. ఒక వారం పాటు ఎండ బెట్టి తర్వాత పొడి చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు, ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ మందారం పువ్వు పౌడర్, బ్రౌన్ రైస్ పౌడర్, వేసి కలిపి పెట్టుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా పెరుగు, కలబంద రసం వేసి బాగా కలపాలి. తర్వాత ప్యాక్ వేసుకోవాలి.

గులాబీ, తేనె, పెరుగు ఫేస్ ప్యాక్ కావల్సిన వస్తువులు: 10-15 తాజా గులాబీ రేకులు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 కప్ పెరుగు

రిసిపి: ఈ ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవడానికి , ఒక బౌల్లో నీళ్లు పోసి, అందులో కొన్ని గులాబీ రేకులు వేసి నానబెట్టాలి. ఈ గులాబీ రేకులను మరుసటి రోజు తీసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గులాబీ రేకుల పేస్ట్ కు పెరుగు, తేనె కలిపి మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.

బంతిపువ్వులతో ఫేస్ ప్యాక్ కావల్సిన వస్తువులు: 1 ఒక చిన్న కప్పు బంతిపువ్వుల రేకులు, ½ టీస్పూన్ పెరుగు, ½ గంధం పొడి లేదా పేస్ట్ మిక్సీ గ్రైండర్, 1 చిన్న బౌల్

బంతిపువ్వులతో ఫేస్ ప్యాక్ రిసిపి: ముందుగా బంతిపూల రేకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ఒక బౌల్లోకి తీసుకుని, పెరుగు, గంధం పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఫేస్ ప్యాక్ రెడీ. డ్రై గా మారితే రోజ్ వాటర్ ను కలపుకోవచ్చు. రెడీ అయిన తర్వాత ముఖానికి ప్యాక్ వేసుకోవాలి

మల్లెపూలతో ప్యాక్ కావల్సిన వస్తువులు: 20-25 ఫ్రెష్ పువ్వులు, 1 టేబుల్ స్పూన్ తేనె మిక్సర్, 1 చిన్న బౌల్

మల్లెపూలతో ప్యాక్ రిసిపి: మల్లెపువ్వుల రేకులు, కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకుని, తేనె వేసి స్మూత్ పేస్ట్ గా చేసుకోవాలి. ఇది సెన్సిటివ్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

తామరపువ్వులతో ఫేస్ ప్యాక్ కావల్సిన వస్తువులు: 10 తామరపువ్వు రేకులు 1/2 చిన్న కప్పు పచ్చిపాలు కొన్ని చుక్కల బాదం ఆయిల్ మిక్సర్ 1 చిన్న బౌల్ రిసిపి ముందుగా తామరపువ్వు రేకులను మొత్తగా పేస్ట్ చేసి, అందులో పచ్చిపాలు, బాదం ఆయిల్ మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ గా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories