చర్మ సమస్యలకు బ్లూ టీ..

చర్మ సమస్యలకు బ్లూ టీ..
x
Highlights

అందరికీ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. తీసుకునే ఆహారం దగ్గరి నుంచి తాగే టీ వరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే చాలా...

అందరికీ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. తీసుకునే ఆహారం దగ్గరి నుంచి తాగే టీ వరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే చాలా మంది సాధారణ టీ కాకుండా హెర్బల్ టీ తాగుతున్నారు. అందులోనూ ప్రముఖంగా గ్రీన్ టీని సేవిస్తున్నారు. దీనితో పాటు అనేక రకాల టీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వీటితో పాటుగా ఇప్పుడు బ్లూ టీ అనే మరొక టీ వెరైటీ కొత్తగా వచ్చి చేరింది. మరి ఈ బ్లూ టీ తయారీతో పాటు దీనివల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బ్లూ టీ పౌడర్‌ను క్లిటోరియా టర్నటీ అనే మొక్క పువ్వులను ఎండబెట్టి తయారు చేస్తారు. వాస్తవానికి ఈ మొక్క మన చుట్టు పరిసర ప్రాంతాల్లోనే పెరుగుతుంది. వీటి నుండి పువ్వులను తీసి నీడలో ఎండబెట్టి పొడి చేసి ఆ తర్వాత ఎండబెట్టిన పొడిని నీటిలో వేసి బాగా మరిగిస్తారు. దీంతో డికాషన్ తయారవుతుంది. ఆ డికాషన్‌ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. రుచి కోసం అందులో నిమ్మరసం లేదా తేనెను కలుపుకోవచ్చు.

బ్లూ టీ తాగడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బ్లూ టీ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్న వారు బ్లూ టీ తాగితే మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories