పచ్చిమిరప చేసే మేలు తెలిస్తే...

పచ్చిమిరప చేసే మేలు తెలిస్తే...
x
Highlights

ఏ కూరైనా దానిలో పచ్చి మిర్చి ఉంటే దాని రుచే వేరు. కూరల్లో ఘాటు కోసం ఎక్కువ మంది పచ్చి మిరపకాయల్లో వాడుతాం. ముఖ్యంగా మిరపకాయల్లో కేలరీలు చాలా...

ఏ కూరైనా దానిలో పచ్చి మిర్చి ఉంటే దాని రుచే వేరు. కూరల్లో ఘాటు కోసం ఎక్కువ మంది పచ్చి మిరపకాయల్లో వాడుతాం. ముఖ్యంగా మిరపకాయల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిని తినడం వల్ల మనకు కేలరీల కంటే శక్తి ఎక్కువగా వస్తుంది. పచ్చిమిరపను తీసుకోవడం వలన జీవన క్రియలు సాఫీగా జరుగుతాయి. వీటిల్లో పలు రకాల ఔషద గుణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి బయటకు పంపించివేస్తాయి. దీని వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ప్రొస్టేట్ గ్రంధి సమస్యలు కూడా దూరమవుతాయి. గుండె వ్యాధులు కూడా రక్షిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని కొలస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి ధమనుల లోని కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి. వాటిలో స్పైసిగా ఉండే రసాయనమైన క్యాప్సేసియన్ శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి సహకరిస్తుంది. అలాగే జలుబు, సైనస్ ఉన్నవారికి పచ్చిమిరప సహజ ఔషదంగా పని చేస్తుంది.పచ్చిమిర్చి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను క్రమబద్దీకరిస్తుంది. కావున అతిగా కాకుండా మితిగానైనా కూరల్లో పచ్చి మిర్చిని ఉపయోగిచండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories