పసుపు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..

పసుపు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..
x
Highlights

నిత్యం ఇంట్లో వంటల్లో ముఖ్య‌మైనది ప‌సుపు. ప‌సుపు లేకుండా వంట‌లు చేయ‌డానికి చాలా మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డ‌రు. ప‌సుపు వంట‌లే కాదు ఆరోగ్యానికి మ‌రియు అందాన్ని...

నిత్యం ఇంట్లో వంటల్లో ముఖ్య‌మైనది ప‌సుపు. ప‌సుపు లేకుండా వంట‌లు చేయ‌డానికి చాలా మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డ‌రు. ప‌సుపు వంట‌లే కాదు ఆరోగ్యానికి మ‌రియు అందాన్ని కాపాడాటానికి కూడా చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ప‌సుపుతో కొన్ని చిట్కాలు పాటించే అందం మ‌రియు ఆరోగ్యం మీ సొంతం చేసుకొవ‌చ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* పసుపు లో యాంటీ ఇన్ ఫ్లోమెంటరి అనే లక్షణం ఉంటుంది. ఈ లక్షణానికి నోప్పులను నివారించే శక్తి ఉంటుంది.

* పసుపు కలిపిన పాలు తాగటం వలన కీళ్ళనోప్పులు, మెడ నోప్పి , కండరాల నోప్పులు, నడుము నోప్పి వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దగ్గు, జలుబు వంటి సమస్యలకు కూడా పసుపు కలిపిన పాలు బాగా ఉపయోగపడతాయి.

* వేడి పాలల్లో పసుపు కలుపుకోని ఉదయం,సాయంత్రం తాగినట్లయితే జలుబు, రోంప చాలా తోందరగా తగ్గుతాయి.గోంతు ఇన్ ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. శరీరంలో ఉండే మలినాలను, విష పదార్ధాలను పసుపు పోగోడుతుంది.

* ఇంకా చర్మనికి సంబందించిన వాటిల్లో కూడా పసుపు ఒక చక్కని మెడిసిన్. ముఖంపై వచ్చే మొటిమలను నివారించటానికి చర్మన్ని కాంతివంతంగా మార్చటానికి పసుపు చాలా ఉపయోగపడుతుంది.పాలల్లో పసుపు కలుపుకోని ముఖానికి రాసుకుంటే ముఖ ఛాయ మెరుస్తుంది.

*పసుపు లో ఉండే యాంటి ఫంగల్ , యాంటి వైరల్ గుణాలు రోగ నిరోదక శక్తిని పెంచుతాయి తద్వారా మన శరీరం తోందరగా ఇన్ ఫెక్షన్ల భారీన పడకుండా కాపాడుతాయి.పసుపు కలిపిన పాలు తాగటం వలన ఆడవాళ్ళలో నెలసరి సమయంలో వచ్చే కడుపు నోప్పి , నడుము నోప్పి , చిరాకు వంటివి దరి చేరకుండా ఉంటాయి.

* పసుపులో ఉండే కురుకుమిన్ వలన కీళ్ళనోప్పులు , కండరాల నోప్పులు తగ్గటమే కాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాదుల నుండి కాపాడుతుంది.

* డయాబెటిస్ ఉన్నవాళ్ళు పసుపు కలిపిన పాలు తాగటం వలన రక్తంలో ఉన్న చక్కెర ను తగ్గిస్తుంది దీని వలన షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories