Sugar Cane Juice: చెరుకు రసంతో నిజంగా ఇన్ని లాభాలున్నాయా.?

Health Benefits of Sugarcane Juice A Natural Energy Booster and Immunity Enhancer
x

Sugar Cane Juice: చెరుకు రసంతో నిజంగా ఇన్ని లాభాలున్నాయా.? 

Highlights

Sugar Cane Juice: ఎలాంటి కల్తీ లేకుండా లభించే డ్రింక్స్‌లో చెరుకు రసం ఒకటి. కాలంలో సంబంధం లేకుండా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

Sugar Cane Juice: ఎలాంటి కల్తీ లేకుండా లభించే డ్రింక్స్‌లో చెరుకు రసం ఒకటి. కాలంలో సంబంధం లేకుండా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా చెక్కర రసం కూడా తక్కువ ధరలోనే లభిస్తుంది. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో చెరుకు రసం విరివిగా లభిస్తుంది. చెరుకు రసంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రింక్‌ను రెగ్యులర్‌గా డైట్‌లో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెరుకు రసాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే అలసట తగ్గించడంతోపాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రక్తంలో చక్కెర శాతం తగ్గినప్పుడు తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు గ్లాసు రసం తాగడం ఆరోగ్యానికి మంచిది. కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. చెరుకు రసంలో మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. చెరుకు రసంలో అల్లాన్ని కలుపుకొని తీసుకుంటే గొంతు సమస్యలు తగ్గుతాయి.

పచ్చకామెర్లతో బాధపడేవారికి చెరుకు రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాగే చెరుకు రసంలో విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. వాంతులతో బాధపడేవారు చెరుకు రసాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. చెరుకు రసంలో ప్రొబయోటిక్ గుణాలు ఉండటంతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొద్దిగా నిమ్మరసం లేదా అల్లం కలిపి తాగితే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.

చెరుకు రసంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు దీనిని తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. చెరుకు రసం సహజ డయూరెటిక్‌గా పనిచేస్తుంది. మూత్రంలో మంట, మూత్రాశయ ఇన్ఫెక్షన్‌, కిడ్నీ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. ఇందులోని పొటాషియం, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు చెరుకు రసం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories