అవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు.. కానీ ఉపయోగాలు చూస్తే..

అవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు.. కానీ ఉపయోగాలు చూస్తే..
x
Benefits of sago
Highlights

భారతీయ వంట గదుల్లో సర్వసాధారణంగా కనిపించే పదార్ధం సగ్గుబియ్యం. కర్రపెండలం నుంచి తయారు చేసే పిండి పదార్ధం ఈ సగ్గుబియ్యం.

భారతీయ వంట గదుల్లో సర్వసాధారణంగా కనిపించే పదార్ధం సగ్గుబియ్యం. కర్రపెండలం నుంచి తయారు చేసే పిండి పదార్ధం ఈ సగ్గుబియ్యం.ఇందులో కొవ్వు పదార్ధాలు ప్రోటీన్లు , గ్లూటెన్‌లు ఉండవు. ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. దీనితో పాటే ఖనిజాలు , విటమిన్ల , ఐరన్ , కాల్షియం , కార్బోహైడ్రేట్‌ లశాతం పుష్కలంగా ఉంటడటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గాలన్నా...పెరగాలన్నా.. సగ్గుబియ్యాన్ని తీరుకునే విధానం బట్టి ఉంటుంది. అధికబరువుతో బాధపడే వారు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు. అలాగే వీటిలో కొవ్వు శాతం ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

పిండి పదార్ధం అధికంగా ఉండే సగ్గుబియ్యం షుగర్ పేషంట్స్‌కు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇవి రక్తంలోని చెక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక కర్రపెండలంలో అధిక ఫైబర్ ఉంటుంది..అదే సగ్గుబియ్యంలో ఉంటుంది. కాబట్టి దీనిని తరచుగా తీసుకోవడం వల్ల జీర్నసమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మలబద్దకాన్ని తగ్గించడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. సగ్గుబియ్యంలో ఫైబర్ శాతమే కాదు కాల్షియం ఐరన్ లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు. సగ్గుబియ్యంలో అధిక మొత్తంలో పొటాషియం.. తక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది.. కాబట్టి ఈ పదార్ధం అధిక రక్తపోటు ఉన్నవారికి చక్కటి ఆహారం.

సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల వీటిని హెర్బల్ మెడిల్స్‌లో ఉపయోగిస్తుంటారని నిపుణుల మాట. సగ్గుబియ్యంతో పాటు బియ్యం కూడా చేర్చి వండి తినడం వల్ల శరీరంలోని వేడి తగ్గుముఖం పడుతుంది. శారీరక వేడితో బాధపడేవారు ఈ సగ్గుబియ్యం తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన చక్కటి ఫలితం కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఇవి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తాయట.. తరుచుగా వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు. మరి మీరు కూడా ట్రై చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories