Health: వృద్ధాప్యంలో ఇబ్బందులు రావొద్దంటే.. తీసుకునే ఆహారంలో ఇవి ఉండాల్సిందే..!

Health Benefits of Nuts for the Elderly Latest Study Says
x

Health: వృద్ధాప్యంలో ఇబ్బందులు రావొద్దంటే.. తీసుకునే ఆహారంలో ఇవి ఉండాల్సిందే..!

Highlights

Health Benefits of Nuts: వయసు మళ్లిన వారిలో అనారోగ్య సమస్యలు రావడం సర్వసాధారణమైన విషయం.

Health Benefits of Nuts: వయసు మళ్లిన వారిలో అనారోగ్య సమస్యలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ సమస్యల బారినపడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో నట్స్‌ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మోనాష్ యూనివర్సిటీకి చెందని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పరిశోధనలో భాగంగా 70 ఏళ్ల పైబడిన 9916 మందిని పరిగణలోకి తీసుకున్నారు.

వీరిలో నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకున్న వారు ఎక్కువ కాలం జీవించారని పరిశోధనలో వెల్లడైంది. వీరికి మతిమరుపు, వైకల్యం వంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. నట్స్‌లో ప్రొటీన్, పోషకాలు, ఫైబర్‌, అసంతృప్త కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అత్యవసరమైన పోషకాలను అందించడంతో పాటు శక్తిని ఇస్తాయి. బాదం, పిస్తా, వేరుశెనగ, ఆక్రోట్, కజూ వంటి నట్స్‌ను తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.

అయితే ముసలివాళ్లలో నట్స్‌ నమలడం కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా ఉంటుండొచ్చు. అలాంటి వారు నట్స్‌ను నానబెట్టి, లేదా బటర్‌ రూపంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పీనట్ బటర్‌లాగా అన్ని రకాల నట్స్‌ బటర్‌ రూపంలో లభిస్తున్నాయి. వీటిని తీసుకున్నా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే ఉప్పు, చక్కెర, చాక్లెట్ కలిపిన నట్స్‌కు దూరంగా ఉండాలి.

ప్రకృతిసిద్ధమైన, తాజా గింజ పప్పులను తీసుకోవడం ఉత్తమం. వీటిని గాలి చొరని సీసాల్లో భద్రపరిచి, చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఇక వృద్ధులు రోజుకు 30 గ్రాముల నట్స్‌ను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో బాదం, ఆక్రోట్లు, వేరు శెనగలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories