ముల్లంగి పోషకాల గని...

ముల్లంగి పోషకాల గని...
x
Highlights

కూరగాయాలు అరోగ్యంగా ఉండడంలో తోడ్పడతాయి. వాటిలో ఉండే పోషకాలు మనల్ని అనారోగ్యానికి గురికాకుండా చూస్తాయి. వివిధ కూరగాయాలు వివిధ రకాల షోషకాలను కలిగి...

కూరగాయాలు అరోగ్యంగా ఉండడంలో తోడ్పడతాయి. వాటిలో ఉండే పోషకాలు మనల్ని అనారోగ్యానికి గురికాకుండా చూస్తాయి. వివిధ కూరగాయాలు వివిధ రకాల షోషకాలను కలిగి ఉంటాయి. అయితే మనం అన్ని రకాల కూరగాయాలను తినడానికి ఇష్టపడం. ముఖ్యంగా ముల్లంగి లాంటి వాటిని తీనడానికి కొంత అయిష్టాన్ని వ్యక్తం చేస్తాం. దాంతో ముల్లంగి లాంటి అరుదైన కూరగాయల్ని తినే అవకాశం కోల్పోతుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు ముల్లంగి వల్ల కలిగే ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాల్ని చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

- ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడైన వాటిని తింటుండాలి.

- పెద్దవాళ్లు అర్ష మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్లు ముల్లంగి చక్కటి పరిష్కారం.

- ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటు. ఆకలిని పెంచి... మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు కూడా వాటిలో ఉన్నాయి.

- ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్లు... భోజనం తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి.

- ముల్లంగి రోజుకు మూడు సార్లు తింటే చాలు. మలబద్ధకం, అర్ష మొలలు, ప్లీహం, కామెర్ల వంటి అడ్డమైన సమస్యలూ దూరమవుతాయి.

- ముల్లంగి ఆకులలో విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వాటి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి... నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి... తాగితే... మూత్ర సంబంధ మంట తగ్గుతుంది.

- ఊపిరితిత్తుల్లో స్ఫుటం ఉన్నట్టు అనిపించి మాటిమాటికీ దగ్గుతూ ఉంటారు. దీనికి కారణం బ్రాంకైటిస్ వ్యాధి. అలాంటి వారు ముల్లంగి జ్యూస్‌లో కొద్దిగా తేనె కలిపి తాగేయాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories