బెండకాయ తింటే... ఎన్ని లాభాలో

బెండకాయ తింటే... ఎన్ని లాభాలో
x
Highlights

కూరగాయాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఉన్నాయి. వాటిలో బెండ అరోగ్యానికి ఎంలో మెలు చేస్తోంది. శరీరానికి మంచి పోషకాలు అందివ్వడంలోనూ బెండకాయ...

కూరగాయాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఉన్నాయి. వాటిలో బెండ అరోగ్యానికి ఎంలో మెలు చేస్తోంది. శరీరానికి మంచి పోషకాలు అందివ్వడంలోనూ బెండకాయ అమోఘంగా పనిచేస్తుంది. బెండకాయలను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పలు పోషకాలు అందడమే కాదు, వాటి వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. బెండకాయలను చాలామంది తినడానికి ఇష్టపడకపోయినా.. వాటి వల్ల అనేక లాభాలు ఉన్నాయి. బెండకాయలను ఫ్రై చేసి తిన్నా, వాటిని పులుసు పెట్టినా తిన్నా చాలా రుచికరంగానే ఉంలుంది. రుచినే కాదు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ బెండకాయ ఎంతో మేలు చేస్తుంది.

బెండకాయల్లో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉండటంవల్ల శరీరానికి పోషక విలువలు అందుతాయి. బెండకాయల్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్స్ కడుపు నిండిన భావనను ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తినడం తగ్గిస్తాం బరువు తగ్గుతాం.బెండకాయల్లో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి నీరసం, అలసట రాకుండా చేసి శరీరం ఉత్తేజంగా ఉండేలా చేస్తాయి. వాటిలోని విటమిన్ ఎ శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టం చేస్తోంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే నేత్ర సమస్యలు పోగొడుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories