రాత్రి పూట అన్నంకు బ‌దులు చ‌పాతీలే బెట‌ర్‌.

రాత్రి పూట అన్నంకు బ‌దులు చ‌పాతీలే బెట‌ర్‌.
x
Highlights

ప్రస్తుత కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై సృహ పెరిగిపోయింది. వివిధ వ్యాధులు పట్టిపీడుస్తున్న తరుణంలో ఆరోగ్యం ప‌ట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ రోజుల్లో...

ప్రస్తుత కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై సృహ పెరిగిపోయింది. వివిధ వ్యాధులు పట్టిపీడుస్తున్న తరుణంలో ఆరోగ్యం ప‌ట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఎదురవుతున్న సమస్య ఊబకాయం. అధికంగా బ‌రువు ఉంటే దాన్ని త‌గ్గించుకోవ‌డం కోసం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వ్యాయామం, యోగా జిమ్‌లతో పాటు ఆహార, జీవ‌న విధానాల్లో మార్పులు చేస్తున్నారు. నిపుణుల సూచన మేరకు స‌రైన పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవ‌డం.. వంటి నియమాలను పాటిస్తున్నారు.

బరువు తగ్గించుకోవడం చాలా మంది రాత్రి పూట అన్నం కాకుండా చ‌పాతీల‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే రాత్రిపూట అన్నానికి బ‌దులుగా చ‌పాతీల‌ను తినడం ఆరోగ్యానికి ఎంత వరకు మచింది. అన్నం తింటే బెటరా! లేక చపాతీలు తింటే బెటరా! అనే దానిపై నిపుణులు మాటే ఏంటో ఓసారి చూద్దాం..

* నైట్ అన్నానికి బ‌దులుగా చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు

* చపాతిలు తినడం వల్ల అధిక బ‌రువు తగ్గడంతో పాటు శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది.

* చ‌పాతీల‌ను తినడం వల్ల అజీర్తి లాంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* చ‌పాతీలు తేలిగ్గా జీర్ణం అవుతాయి. రాత్రి పూట వాటిని తింటే త్వ‌ర‌గా జీర్ణ‌మైవుతాయి కావున నిద్రకు ఆటంకం ఉండదు

* గోధుమ పిండిలో మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ కాప‌ర్‌, జింక్‌, అయోడిన్‌, పొటాషియం, కాల్షియం ఎక్కువ‌గా ఉంటాయి. వీటి వల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది

దంతాలు, ఎముక‌లు దృఢంగా మారుతాయి.

* చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రావు. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బద్దకం లాంటివి త‌గ్గుతాయి.

* చపాతీల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మం షైన్ అవుతుంది. వాటిలో ఐర‌న్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల హిమోగ్లోబిన్ ఆధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories